UP Election : వచ్చే ఏడాది ఎన్నికలు, అప్పుడే హామీల వర్షం

యూపీ ఎన్నికల నగారాకు సమయం దగ్గర పడుతున్నకొద్ది బీజేపీ, కాంగ్రెస్‌లు ఉత్తర ప్రదేశ్ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి..

UP Election : వచ్చే ఏడాది ఎన్నికలు, అప్పుడే హామీల వర్షం

Up Election 2022

UP Assembly Election : యూపీ ఎన్నికల నగారాకు సమయం దగ్గర పడుతున్నకొద్ది బీజేపీ, కాంగ్రెస్‌లు ఉత్తర ప్రదేశ్ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.. వారణాసిలో ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఇదే అదనుగా హామీల వర్షం కురిపిస్తున్నారు.. ఎన్నికలు వచ్చే ఏడాది ఉన్నా.. అప్పుడే యూపీలో పొలిటికల్‌ హీట్ పీక్స్‌కు చేరింది. గత ఐదు రోజుల్లో యూపీలో రెండోసారి పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సొంత నియోజవర్గం వారణాసిలోనూ పర్యటించారు. ‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌’ను వారణాసిలో ప్రారంభించారు.

Read More : Telangana : వ్యాక్సిన్‌‌కు పెన్షన్, రేషన్ లింక్..డీహెచ్ వ్యాఖ్యలపై గందరగోళం!

ఇక ఒకేసారి 9 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు మోదీ. ఈ మెడికల్‌ కాలేజీలతో 900 ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు 3 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఒకేసారి తొమ్మిది వైద్య క‌ళాశాల‌ల‌ను గ‌తంలో ఎన్నడైనా ప్రారంభించ‌డం చూశారా అని మోదీ ప్రశ్నించారు. పూర్వాంచ‌ల్ ప్రజ‌ల‌ను గ‌త ప్రభుత్వాలు గాలికొదిలేశాయ‌ని విమర్శించారు ప్రధాని మోదీ. త‌మ హ‌యాంలో పూర్వాంచ‌ల్‌ను ఉత్తరాదికే మెడిక‌ల్ హ‌బ్‌గా మార్చామ‌న్నారు మోదీ.

Read More : Corona Update: కేరళలోనే ఎక్కువగా కరోనా కేసులు.. భారత్‌లో తగ్గుముఖం!

ఓ వైపు మోదీ తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తుంటే మరోవైపు కాంగ్రెస్‌ యూపీ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తోంది.. మోదీ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన రోజే.. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి పది లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.. దీంతో యూపీ దంగల్‌లో వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్‌ చెప్పకనే చెప్పినట్టవుతోంది.