UP Polls : శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయ నాయకుడు…మేము ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నాము

శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయనాయకుడని... మేమంతా ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నామని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ అన్నారు.

UP Polls : శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయ నాయకుడు…మేము ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నాము

Bhupesh Baghel

UP Polls :  శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయనాయకుడని… మేమంతా ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నామని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ అన్నారు. ఉత్తర‌ప్రదేశ్‌లోని మథుర అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తరుఫున ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన ఈరోజు బాంకీ బిహారీ ఆలయంలో పూజలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ….శ్రీకృష్ణుడు సత్యంకోసం పోరాడిన అతి పెద్ద రాజకీయ నాయకుడు అని మేమంతా అతని నుంచి రాజకీయాలు నేర్చుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు కూడా అయిన బఘేల్ యూపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. యోగీ ఆదిత్యనాధ్‌కు కాలం చెల్లిందని.. రాబోయే రోజుల్లో ఆయన షాకింగ్ న్యూస్ లు వింటారని, ఈ ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.
Also Read : Shamshabad : లీజు పూర్తయ్యింది…ఖాళీ చేయమని అడిగినందుకు దాడి-8 మందికి గాయాలు

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బఘేల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్ధాయిలో బలంగా ఉందని భఘేల్ అన్నారు. మేము ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. 403 అసెంబ్లీ నియోజక వర్గాలుఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 10, 14,20, 23,27, మార్చి 3,7 తేదీల్లో ఎన్నికలు జరిపి మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.