అయోధ్య ఎయిర్ పోర్టు పేరు ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం’

  • Published By: nagamani ,Published On : November 25, 2020 / 02:44 PM IST
అయోధ్య ఎయిర్ పోర్టు పేరు  ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం’

UP: Ayodhya Maryada Purushottam Sri Ram Airport : రామజన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈక్రమంలో అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు నిర్ణయిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ మంత్రివర్గం తీర్మానించింది.



ఆ ఎయిర్ పోర్టుకు ‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయం’గా పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడామని నిర్ణయించటంతో సాధువులు..హిందూ సంస్థలు, రామ భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
https://10tv.in/aiadmk-rs-mp-vijayakumar-family-survived-bomb-blast/


అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టాలన్న ప్రతిపాదన కొంత కాలంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది. అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది.



అయోధ్యకు అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్స్ రెండూ ఉంటాయని గతంలోనే ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇటీవల అయోధ్యలో దీపావళి సందర్భంగా రామ్ జన్మభూమి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించారు.



ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.