UP : విగ్గు ధరించిన పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే

ఈ విషయాన్ని జీర్ణించుకోలేక వధువు సృహ తప్పి పడిపోయింది. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న తర్వాత.. వధువు అసలు విషయం చెప్పింది. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని స్ప

UP : విగ్గు ధరించిన పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే

Bride

UP Bride : ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే వివాహాలు పెళ్లి పీటల మీదే ఆగిపోతున్నాయి. పెళ్లి కొడుకు విచిత్రమైన కోరికలు, భోజనం నచ్చలేదని, తమను సరిగ్గా పట్టించేకోలేదని..ఇలా కొన్ని కారణాలతో పెళ్లిళ్లు బ్రేక్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా.. ఓ పెళ్లి కొడుకు విగ్గు ధరించాడని తెలుసుకున్న పెళ్ళి కూతురు తనకు వివాహం వద్దని ఖరాఖండిగా చెప్పేసింది. ఎంతమంది నచ్చచెప్పినా ఆమె వినిపించుకోలేదు. చివరకు ఆ పెళ్లి కాస్తా ఆగిపోయింది. దీనికి సంబంధించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Read More : Tata Nano: హెలికాప్టర్‌గా మారిన నానో కారు.. పెళ్లి ఊరేగింపుల కోసం స్పెషల్

భర్తనా ఏరియాలో అజయ్ కుమార్ యువకుడి వివాహం బుధవారం రాత్రి జరగాల్సి ఉంది. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు అజయ్ కుమార్ వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. పెళ్లి కూతురు కుటుంబసభ్యులు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. వధువు కూడా పెళ్లి వేదిక వద్దకు చేరుకుంది. ఇరువురి కుటుంబసభ్యులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాతావరణం అంతా సందడి సందడిగా ఉంది. అయితే.. అజయ్ తన తలపాగాను క్షణానికి ఒకసారి సర్దుకుంటున్నాడు. ఇది పెళ్ళి కూతురు గమనించింది. అసలు అలా ఎందుకు సర్దుకుంటున్నాడో అర్థం కాలేదు. చివరకు అతను విగ్గు ధరించి ఉన్నాడని నిర్ధారించుకుంది.

Read More : Uttarakhand : పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. బస్సు లోయలో పడి 14 మంది మృతి

ఈ విషయాన్ని జీర్ణించుకోలేక వధువు సృహ తప్పి పడిపోయింది. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న తర్వాత.. వధువు అసలు విషయం చెప్పింది. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరకు ఏమి చేయలేక వరుడి కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయింది. మొత్తానికి కాసేపట్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వరుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పెళ్ళి కూతురు వివాహానికి ఒప్పుకోలేదు. బారాత్ లో వచ్చిన వారిని వధువు కుటుంబసభ్యులు చితక్కొట్టారు. పెళ్లి కొడుకు జట్టును పట్టుకుని కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమను బందీలుగా పట్టుకుని కొట్టారని వరుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.