పెళ్లికూతురుకు ఊరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే? మ్యారేజ్ మధ్యలో వెళ్లి తెచ్చుకుంది

పెళ్లికూతురుకు ఊరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే? మ్యారేజ్ మధ్యలో వెళ్లి తెచ్చుకుంది

Up Bride Leaves Wedding Ceremony Midway

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని మిలాక్ బ్లాక్‌లోని ముహమ్మద్‌పూర్‌లో ఓ యువతికి పెళ్లి కానుకగా ఊరిని పాలించే హక్కును కట్టబెట్టారు. రాజకీయాల్లో రాణించాలని ఆశీర్వదించారు. పెళ్లి పీటల మీద కూర్చొని, తాళి కట్టించుకునే కొద్దిసేపటి ముందు సరిగ్గా ఆమెకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిసింది. వెంటనే వెళ్లి గిఫ్ట్ తెచ్చేసుకుంది యువతి.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సీటు నుంచి పోటీ చేసిన ఓ అమ్మాయికి ఆమె ఊరి వాళ్లు ఇచ్చిన గిఫ్ట్ ఎన్నికల్లో విజయం. జదీద్ గ్రామానికి చెందిన పూనమ్ శర్మ 135 వార్డు నుంచి పోటీ చెయ్యగా.. పెళ్లి రోజునే ఓట్ల లెక్కింపు జరిగింది.

ఓట్ల లెక్కింపులో యువతి తన ప్రత్యర్థి మీద 31 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుని వరుడితో తాళి కట్టించుకుంది. 28 ఏళ్ల పూనమ్ శర్మ వివాహం మే 2వ తేదీన జరగగా.. అదేరోజు కౌంటింగ్.. పెళ్లి పీటలు మీద ఉండగానే ఆమె గెలిచినట్లుగా తెలుసుకుని, రాత్రి 9.30 గంటలకు సర్టిఫికేట్ తీసుకోవడానికి వివాహ వేదిక నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంది.

కౌంటింగ్ సెంటర్‌లో అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోగా.. గెలిచిన తర్వాత విన్నర్ సర్టిఫికేట్ తీసుకుని, అధికారులతో ఫోటోలకు పోజులిచ్చింది, ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సంధర్భంగా మాట్లాడిన శర్మ.. “నేను ఇప్పుడు BDC సభ్యునిగా అయ్యాను. ఇది నాకు మా ఊరు ఇచ్చాన ఉత్తమ వివాహ బహుమతి. ఈ క్షణాన్ని ఎప్పటికీ మరచిపోలేను. సర్టిఫికేట్ తీసుకోవడానికి అత్తమామల పర్మిషన్ తీసుకున్నాను. నా గెలుపుతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు.” అని శర్మచెప్పారు.

పూనమ్ శర్మ ఈ ఎన్నికల్లో 601 ఓట్లు సాధించగా, సమీప అభ్యర్థి శకుంతల దేవి 570 ఓట్లు సాధించారు.