Ayodhya: రూ.400 కోట్లు ఖ‌ర్చుతో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో బ‌స్‌స్టేష‌న్

అయోధ్య‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన బ‌స్‌స్టేష‌న్ నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. దీనికి సీఎం యోగి ఆదిత్య‌నాథ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ క్యాబినెట్ స‌మావేశం ఆమోద‌ముద్ర వేసింది.

Ayodhya: రూ.400 కోట్లు ఖ‌ర్చుతో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో బ‌స్‌స్టేష‌న్

Ayodhya Bus Station (1)

Bus station with international standards in Ayodhya : అయోధ్య అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది శ్రీరాముడి ఆలయం. రామయ్య ఆలయం ఎంత ప్రతిష్టాతకమైనదో..రామయ్య ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా నిర్మాణం జరుగనుంది. ఈక్రమంలో రామయ్య నిర్మిస్తున్న అయోధ్య‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన బ‌స్‌స్టేష‌న్ నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. దీనికి సీఎం యోగి ఆదిత్య‌నాథ్ అధ్య‌క్ష‌త‌న సోమవారం (జూన్ 14,2021)జ‌రిగిన‌ క్యాబినెట్ స‌మావేశం ఆమోద‌ముద్ర వేసింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే బస్ స్టేషన్ కు రూ.400 కోట్లు ఖ‌ర్చ‌ు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రామాలయం నిర్మాణం పూర్తి అయితే ఆలయాన్ని దర్శించుకోవటానికి దేశవ్యాప్తంగానే కాకుండా విదేశీయులు కూడా భారీగా తరలివస్తారనే ఉద్ధేశ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో బస్ స్టేషన్ ను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది.దీనిపై యూపీ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అందుకోస‌మే ప్ర‌పంచ ప్ర‌మాణాల‌తో కూడిన బ‌స్టాండ్ నిర్మించాల‌ని త‌ల పెట్టామ‌ని..దానికి రూ.400ల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని తెలిపారు.

అలాగే అయోధ్య‌-సుల్తాన్‌పూర్ రోడ్డు మ‌ధ్య నాలుగు లైన్ల ఫ్లైఓవ‌ర్ నిర్మించాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. 1.5 కి.మీ. దూరం గ‌ల ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి రూ.20 కోట్లు ఖ‌ర్చ‌వుతుందని అంచనా వేశామని అన్నారు. అలాగే మరిన్ని నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించిన మంత్రి..బులంద‌ర్ స‌హార్‌లోని అనూప్ స‌హార్‌లో బ‌స్ స్టేష‌న్‌, అల‌హాబాద్‌లోని జీటీ రోడ్డుపై నాలుగు లేన్ల ఫ్లై ఓవ‌ర్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం లభించందని తెలిపారు.