UP CM Yogi: మ‌ధుర‌లో మద్యం, మాంసాలపై నిషేధం

శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌ల‌మైన మ‌ధుర‌లో మ‌ద్యం, మాంసం నిషేధిస్తున్న‌ట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

UP CM Yogi: మ‌ధుర‌లో మద్యం, మాంసాలపై నిషేధం

Bans Liquor And Meat In Mathura

Bans Liquor And Meat In Mathura : శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌ల‌మైన మ‌ధుర‌లో మ‌ద్యం, మాంసం నిషేధిస్తున్న‌ట్లు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌క‌టించారు. శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక సంద‌ర్భంగా సీఎం యోగి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ద్యం, మాంసం అమ్మకాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సోమవారం (ఆగస్టు 30.8.2021) ఆదేశాలు జారీ చేశారు.

హిందువులంతా మధురను శ్రీమహా విష్ణువు అవతారం అయిన శ్రీకృష్ణుడి జన్మస్థానంగా భావిస్తారు. నల్లనయ్యను ఆరాధిస్తారు. శ్రీమహావిష్ణువు జన్మించిన పవిత్ర స్థలంలో మద్యం, మాసాలు విక్రయించకూడదని సీఎం యోగీ ఆదిత్యానాథ్ నిర్ణయించారు. ఈ మేరకు మధురలో మద్యం, మాంసాలపై నిషేధాన్ని అమలు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మ‌ద్యం, మాంసం వ్యాపారం చేస్తున్న వారంతా.. పాల ఉత్ప‌త్తిని పెంచి మ‌ధుర‌కు పూర్వ వైభ‌వాన్ని తీసుకురావాల‌న్నారు. పాలు, మీగడ, వెన్న, నెయ్యి అంటే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవనీ..అందుకే మధుర ఒక‌ప్పుడు పాల ఉత్ప‌త్తికి ప్ర‌సిద్ధి గాంచిందని సీఎం యోగీ సూచించారు.

పాలను పాల పదార్ధాల ఉత్పత్తులకు పెంచి మధురకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలిన మధుర ప్రజలకు సీఎం యోగీ సూచించారు. క‌రోనా మ‌హ‌మ్మారిని పార‌ద్రోలాల‌ని శ్రీకృష్ణుడిని ప్రార్థించిన‌ట్లు యోగి పేర్కొన్నారు.