UP CM Yogi: బ్యూరోక్రాట్లపై కొరడా.. ఒకేసారి 73 మందికి నోటీసులు పంపి షాకిచ్చిన యోగి

ఇందులో 16 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ఇప్పటికే ట్రాన్స్‭ఫర్ చేశారు. అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఇన్ఫర్మేషన్ నవ్నీత్ సెహ్గల్, ఏసీఎస్ హెల్త్ అమిత్ మోహన్ ప్రసాద్‭లు కూడా ఇందులో ఉన్నారు. సెహ్గల్ మంచి ట్రబుల్ షూటర్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈయనకు అంతగా ప్రాధాన్యం లేని స్థానం కేటాయించనున్నట్లు తెలుస్తోంది

UP CM Yogi: బ్యూరోక్రాట్లపై కొరడా.. ఒకేసారి 73 మందికి నోటీసులు పంపి షాకిచ్చిన యోగి

UP CM Yogi Adityanath serves notices on 73 top officers

UP CM Yogi: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొరడా ఝళిపించింది. రాష్ట్ర కేడర్‭లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న 73 మంది బ్యూరోక్రాట్లకు ఒకేసారి నోటీసులు పంపారు. జన్ సున్‌వాయ్ పోర్టల్, సీఎం హెల్ప్‌లైన్ ద్వారా స్థానిక యంత్రాగం, పోలీసులు, ఫేస్‌బుక్ నుంచి సీఎంఓ కార్యాలయానికి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చింది.

నోటీసులు అందుకున్న వారిలో 10 మంది శాఖాధికారులు, ఐదుగురు కమిషనర్లు, 10 మంది జిల్లా మెజిస్ట్రేట్‌లు, ఐదుగురు డవలప్‌మెంట్ అథారిటీ వైస్-ప్రెసిడెంట్లు, ఐదుగురు మున్సిపల్ కమిషనర్‌లు, 10 మంది తహసిల్దారులు కూడా ఉన్నారు. వీటితో పాటు ముగ్గురు ఏడీజీలు, ఐడీలు, ఐదుగురు ఐజీలు, డీఐజీలు, 10 కమిషనరేట్లు, 10 పోలీస్ స్టేషన్లను వివరణ ఇవ్వాలని కోరింది.

Narmada Canal: ముగ్గురు పిల్లల్ని కెనాల్‭లో విసిరేసి.. ప్రియుడితో కలిసి అదే కెనాల్‭లో దూకిన మహిళ

ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు అందుకున్న శాఖల్లో పర్సనల్, ఆయుష్, టెక్నికల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ డవలప్‌మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, నమామి గంగే, రూరల్ వాటర్ సప్లయ్, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, క్లైమైట్ ఛేంజ్ శాఖలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఇందులో 16 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ఇప్పటికే ట్రాన్స్‭ఫర్ చేశారని తెలుస్తోంది. అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఇన్ఫర్మేషన్ నవ్నీత్ సెహ్గల్, ఏసీఎస్ హెల్త్ అమిత్ మోహన్ ప్రసాద్‭లు కూడా ఇందులో ఉన్నారు. సెహ్గల్ మంచి ట్రబుల్ షూటర్ అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఈయనకు అంతగా ప్రాధాన్యం లేని స్థానం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్‭తో వివాదాస్పదమై ప్రసాద్ స్థానాన్ని కూడా అంతగా ప్రాధాన్యం లేని చోటకు మార్చనున్నారట. 16 మంది ప్రభుత్వంతో అంత సఖ్యతగా లేరని, అందుకే ఈ మార్పని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Hyderabad Drug Bust : డ్రగ్ డాన్ అరెస్ట్.. రిస్క్ చేసి మరీ గోవాలో నరేంద్ర ఆర్యను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు