UP Electric charges : రైతులకు 50% విద్యుత్ ఛార్జీలు తగ్గించిన సీఎం యోగీ

UP CM యోగీ రైతులకు శుభవార్త చెప్పారు. 50% విద్యుత్ ఛార్జీలు తగ్గించామని ప్రకటించింది.

UP Electric charges : రైతులకు 50% విద్యుత్ ఛార్జీలు తగ్గించిన సీఎం యోగీ

Electricity Charges In Up

Electricity charges in UP: యూపీతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో యూపీ ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు విద్యుత్ 50 శాతం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. ఇదంతా ఎన్నికల ఎత్తుగడేనని ఓట్ల కోసం యోగీ ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో రైతులపై యోగీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రైతులకు విద్యుత్ బిల్లులను 50 శాతం తగ్గిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను ఖండిస్తోంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కార్యాలయం ట్వీట్ తో ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటనతో యూపీలో గ్రామీణప్రాంతాల్లో 13 లక్షలమందికి ప్రయోజనం చేకూరనుంది.

Read more : Bipin Rawat: యూపీలోని సైనిక్‌ స్కూల్‌కు దివంగత జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరు

ప్రభుత్వం తాజా ప్రకటనతో ఇంతకు ముందు ఇది రూ.2గా ఉన్న మీటర్​ కనెక్షన్​ ఉన్నపై యూనిట్​ విద్యుత్​కు ఒక రూపాయి ఛార్జీ చేయనున్నారు. ఒక హార్స్​ పవర్​ మీటర్​పై ఛార్జీని రూ.70 నుంచి రూ.35కు తగ్గించనున్నారు. మీటర్​ లేని కనెక్షన్​కు ఒక హార్స్​ పవర్​కు రూ.170 నుంచి రూ.85 ఛార్జీకి తగ్గించారు.

ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి మీటర్​ కనెక్షన్​పై యూనిట్​ విద్యుత్​కు ప్రస్తుతం ఇది రూ.6గా ఉన్న చార్జీలను ప్రకటన తరువా రూ.3 చొప్పున ఛార్జీ వసూలు చేయనున్నారు. ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇతర పార్టీలు కూడా ప్రజలకు విద్యుత్ ఛార్జీలపై హామీలు ఇచ్చాయి. తమ పార్టీని గెలిపిస్తే రైతులు 300 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవానికి అవకాశమిస్తామని సమాజ్​వాది పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హామీ ఇచ్చింది.

Read more : PM Modi: ప్రధానికి భద్రతా వైఫల్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు

13 లక్షల మంది రైతులకు (గొట్టపు బావులు ఉన్నవారు) ఈ ప్రకటన తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ వర్గం నుండి UPPCL పొందే మొత్తం ఆదాయం దాదాపు రూ.1900 కోట్లు. ఈ విధంగా సాగునీటి అవసరాల కోసం గొట్టపు బావులను వినియోగించుకునే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్లో సగం చెల్లిస్తుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ , ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మల వైపు నుంచి ఇది స్వాగతించాల్సిన విషయం అని యూపీ రాజ్య విద్యుత్ ఉపభోగతా పరిషత్ అధ్యక్షుడు అవధేష్ వర్మ తెలిపారు.