Viral Letter : నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరిన కానిస్టేబుల్.. ఐదు రోజులు సెలవిచ్చిన అధికారి

నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరాడు ఓ కానిస్టేబుల్..కానిస్టేబుల్ బాధను అర్థం చేసుకున్న ఉన్నతాధికారి ఐదు రోజులు సెలవిచ్చారు.

Viral Letter : నా భార్య అలిగింది సార్..బతిమాలుకోవటానికి సెలవు కావాలని కోరిన కానిస్టేబుల్.. ఐదు రోజులు సెలవిచ్చిన అధికారి

up constable leave letter Because ‘Wife’s Angry’ gone viral on social media

constable Viral Letter : ‘మా బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..సార్ అంటూ గతంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన దిలీప్ కుమార్ అహిర్వార్ అనే కానిస్టేబుల్ లీవ్ అడిగిన లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అలాగే ‘నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్’ అంటూ మధ్యప్రదేశ్‌ రేవాలో మరో కానిస్టేబుల్ రాసిన లెటర్ కూడా పిచ్చ పిచ్చగా వైరల్ అయ్యింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఓ కానిస్టేబుల్ తనకు లీవ్ కావాలంటూ ఉన్నతాధికారులను కోరుతూ రాసిన లీవ్ లెటర్ దానికి సంబంధించిన కారణం తెగ వైరల్ అవుతోంది.

Read more : కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ లో సారాంశం ఏంటంటే..సదరు కానిస్టేబుల్ భార్య అలిగిందంట..భార్యను బతిమాలుకోవటానికి లీవ్ కావాలంట..! అందుకోసం లీవ్ కావాలంట..! ఈ లెటరే ఓ వింత అంటే ..ఈ లెటర్ కు స్పందించి ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్ కు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు లీవ్ ఇవ్వటం మరో విశేషం అని చెప్పాలి. మరి సదరు ఉన్నతాధికారులకు కూడా భార్య అలిగితే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో బహుశా స్వానుభవంతోనే ఆ కానిస్టేబుల్ కు లీవ్ సాంక్షన్ చేసినట్లున్నారు కాబోలు అంటూ నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ ఆకానిస్టేబుల్ భార్య ఎందుకు అలిగిందో తెలుసుకుందాం..

Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ గౌరవ్ చౌదరి భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న నౌతన్వా పోలీస్ స్టేషన్‌లో నియమించబడ్డాడు. అతనికి 2022 డిసెంబరులో వివాహమైంది. గౌరవ్ చౌదరి భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న నౌతన్వా పోలీస్ స్టేషన్‌లో నియమించబడ్డాడు. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యను వదిలి డ్యూటీలో తిరిగి చేరాల్సి వచ్చింది. అప్పటినుంచి ఇంటికి వెళ్లలేకపోయాడు. మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుతుండేవాడు. జనవరి 10న తన మేనల్లుడి పుట్టిన రోజు వేడుకకు వస్తానని హామీ ఇచ్చాడు. ఆ తరువాత గౌరవ్ పై అలిగిన ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం మానేసింది.

Teachers Leave Letters viral : టీచర్ల వింత లీవ్ లెటర్లు..! మ్యాటర్ చూసిన ఉన్నతాధికులకు దిమ్మ తిరిగిపోయింది..!!

దీంతో భార్య తనపై అలిగిందని అర్థం చేసుకున్న గౌరవ్ కు ఏం చేయాలో తెలియలేదు. భార్యను బతిమాలుకోవాలి. అలక తీర్చాలి. సెలవుపెట్టి ఇంటికెళ్లాలని ఉంది. కానీ లీవులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఏదోకటి చేయాలని అనుకున్నాడు. అన్నుకున్నవెంటనే తనపై అధికారి ఏఎస్పీకి లీవ్ లెటర్ రాస్తూ.. ‘పెళ్లయిన వెంటనే తన భార్యను వదిలి వచ్చినందుకు ఆమె తనపై అలిగిందని, ఫోన్ చేసినా స్పందించడం లేదని..తన ఫోన్ కట్ చేస్తోందని, కొన్నిసార్లు ఫోన్ ఎత్తినా మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోందని చెబుతూ వాపోయాడు. కాబట్టి అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు తనకు వారం రోజుల సెలవు కావాలని ఆ లీవ్ లెటర్‌లో విజ్ఞప్తి చేశాడు. ఆ లేఖ చూసి గౌరవ్ బాధను అర్థం చేసుకున్న ఏఎస్పీ ఐదు రోజుల సెలవు మంజూరు చేశారు. ఇప్పుడీ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read more : viral letter : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…