Uttar Pradesh: దొంగల్ని గుర్తించేందుకు టాయిలెట్‌లో సీసీ కెమెరాలు పెట్టిన పోలీసులు.. మండి పడుతున్న విద్యార్థులు

ఉత్తర ప్రదేశ్, అజాంఘర్‌లోని డీఏవీ పీజీ కాలేజీలో కొంతకాలంగా నల్లాలు (వాటర్ ట్యాప్స్) చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా బాత్ రూమ్స్, టాయిలెట్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కొట్టేస్తున్నారు. దీంతో దొంగల్ని గుర్తించే ఉద్దేశంతో అజాంఘర్ పోలీసులు కాలేజ్ క్యాంపస్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Uttar Pradesh: దొంగల్ని గుర్తించేందుకు టాయిలెట్‌లో సీసీ కెమెరాలు పెట్టిన పోలీసులు.. మండి పడుతున్న విద్యార్థులు

Uttar Pradesh: దొంగల్ని గుర్తించేందుకు పోలీసులు చేసిన పని విద్యార్థులకు కోపం తెప్పించింది. పోలీసులు, కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్, అజాంఘర్‌లోని డీఏవీ పీజీ కాలేజీలో కొంతకాలంగా నల్లాలు (వాటర్ ట్యాప్స్) చోరీకి గురవుతున్నాయి.

Rafael Nadal: టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్.. 2005 తర్వాత ఇదే తొలిసారి

ముఖ్యంగా బాత్ రూమ్స్, టాయిలెట్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కొట్టేస్తున్నారు. దీంతో దొంగల్ని గుర్తించే ఉద్దేశంతో అజాంఘర్ పోలీసులు కాలేజ్ క్యాంపస్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే, టాయిలెట్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. ఓపెన్ టాయిలెట్లు ఉన్న ప్లేసులో, క్యాంపస్ బిల్డింగ్ పై భాగంలో పోలీసులు సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల తమకు ప్రైవసీ ఉండదని, ఈ చర్య తమ గోప్యతను హరించడమే అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమన్యం అవినీతిలో కూరుకుపోయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ.. వ్యతిరేకించిన సీబీఐ

పోలీసులు, కాలేజీ యాజమాన్యం తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. దీంతో కాలేజీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థులకు క్షమాపణలు చెప్పింది. కాలేజీ పరిధిలో అనేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఒక కెమెరా పొరపాటున టాయిలెట్ల వైపు వెళ్లిందని మేనేజ్‌మెంట్ తెలిపింది. ఆ సీసీ కెమెరా వెంటనే తొలగించి, మరో చోట అమరుస్తామని హామీ ఇచ్చింది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.