Azam Khan: ఎస్పీ సీనియర్ నేత అజాం ఖాన్‭కు భారీ ఊరట.. నిర్ధోషిగా తేల్చిన యూపీ కోర్టు

ఖాన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడటంతో, రాంపూర్ సదర్ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. అయితే ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై పరాభవం పొందారు

Azam Khan: ఎస్పీ సీనియర్ నేత అజాం ఖాన్‭కు భారీ ఊరట.. నిర్ధోషిగా తేల్చిన యూపీ కోర్టు

UP Court: సమాజ్‭‭వాదీ పార్టీ సీనియర్ నేత అజం ఖాన్‭కు భారీ ఊరట లభించింది. 2019 నాటి విద్వేష ప్రసంగం కేసులో జైలు జీవితం అనుభవించడమే కాకుండా తన అసెంబ్లీ సభ్యత్వాన్ని పోగొట్టుకున్నారు ఆయన. అయితే ఈ కేసులో ఆయనను నిర్ధోషిగా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ కోర్టు. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను ఉత్తరప్రదేశ్ కోర్టు ఈరోజు నిర్దోషిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశించి ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడినందుకు గత ఏడాది సమాజ్‌వాదీ నేతను దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పును రాంపూర్ కోర్టు తోసిపుచ్చింది.

Gone Prakash Rao: బండి సంజయ్‌‌పై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తా.. వాళ్లిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నారు

అజాం ఖాన్ తరపు న్యాయవాది వినోద్ శర్మ మాట్లాడుతూ “విద్వేషపూరిత ప్రసంగం కేసులో మాకు విముక్తి లభించింది. మాకు న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది. కేసులో మమ్మల్ని ఇరికించారనే మా వాదనను కోర్టు సమర్థించింది. తీర్పు మాకు అనుకూలంగా ఉంది” అని అన్నారు. ఖాన్ శిక్షపై దాఖలైన అప్పీల్‌ను ప్రత్యేక కోర్టు స్వీకరించిందని ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దేశంలో ముస్లింల ఉనికిని ప్రధాని ప్రమాదంలో నెట్టేస్తున్నారని 2019 అజాంఖాన్ ఆరోపించారు. ఈ కేసులోనే 2022 తీర్పు తర్వాత ఖాన్ ఎమ్మెల్యేగా అనర్హత వేటు ఎదుర్కొన్నారు.

Mumbai police band : ముంబయి పోలీస్ బ్యాండ్ మామూలు పాట వాయించలేదుగా !!

ఖాన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడటంతో, రాంపూర్ సదర్ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. అయితే ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై పరాభవం పొందారు. రాంపూర్ సహా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఆజం ఖాన్‌కు అనుచరులు బలంగా ఉన్నారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి అవినీతి, దొంగతనం నుంచి భూకబ్జా వంటి నేరారోపణల కారణంగా సమాజ్‌వాదీ నేతపై 87 కేసులు నమోదు అయ్యాయి.