Criminal Died :పోలీసుల నుంచి తప్పించుకుని..బాత్రూమ్‌ కిటికీలోంచి దూకిన క్రిమినల్ మృతి

Criminal Died :పోలీసుల నుంచి తప్పించుకుని..బాత్రూమ్‌ కిటికీలోంచి దూకిన క్రిమినల్ మృతి

Criminal Falls From Bathroom Window

criminal falls from bathroom window: నేరం చేసినప్పుడు లేని భయం పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం నేరస్థులకు మాత్రం ఉంటుంది.అందుకే పోలీసులకు దొరక్కుండా దాక్కొంటుంటారు. అలా ఓ నేరస్థుడు పోలీసుల నుంచి తప్పించుకుని ఇంటిలోంచి బైటకు రావటల్లేదు. దీంతో సదరు నేరస్థుడు ఓ ఇంటిలో ఉన్నాడనే పక్కా సమాచారంతో అరెస్ట్ చేయటానికి ఇంటికెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సదరు క్రిమినల్ పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఏకంగా బాత్రూమ్ కిటిలోనుంచి దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలై అతని ప్రాణాల్నే తీసింది. ఏంటీ బాత్రూమ్ కిటికీ నుంచి దూకేస్తేనే చనిపోయాడా? అనుకోవచ్చు. ఎందుకంటే ఈ బాత్రూమ్ రెండవ అంతస్తులో ఉంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

చాంద్‌ మ‌హ‌మ్మ‌ద్ ఇమ్రాన్ అనే నేర‌స్థునికోసం గ్రేట‌ర్ నోయిడాలోని ఒమైక్రాన్ అనే ప్రాంతంలో ఉన్న ఇంటిపై పోలీసులు దాడిచేశారు. ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ ఇద్ద‌రు బామ్మ‌ర్దులు అతని అనుచరులు అయిన ల‌క్మాన్‌, చాంద్ మ‌హమ్మ‌ద్‌లు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. వారిని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్రమంలో మ‌హ‌మ్మ‌ద్ బాత్రూమ్‌ అనిచెప్పి వెళ్లాడు.

పోలీసుల క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకోవాలని యత్నించాడు. దాంట్లో భాగంగా బాత్రూమ్‌ కిటికీలో నుంచి కిందికి దూకాడు. అది రెండో అంత‌స్థులో ఉండ‌టంతో కింద‌ప‌డిన అత‌నికి తీవ్రంగా గాయాల‌య్యాయి. దీంతో పోలీసులు అత‌డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయాలు కావటంతో చికిత్స పొందుతూ మహ్మద్ ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని గ్రేట‌ర్‌ నోయిడా డీసీపీ రా‌జేష్ కుమార్ సింగ్ తెలిపారు. చాంద్‌పై పదికి పైగా దొమ్మి కేసులు, హ‌త్య కేసులు ఉన్నాయ‌ని, ఇన్‌స్పెక్ట‌ర్ అక్త‌ర్ ఖాన్ హ‌త్య కేసులో అత‌డు ప్ర‌ధాన నిందితుడ‌ని వెల్ల‌డించారు.