UP Election: యూపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. సామాన్యులకే సీట్లు.. ఉన్నావ్ బాధితురాలి తల్లికి టిక్కెట్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ మధ్య పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.

UP Election: యూపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. సామాన్యులకే సీట్లు.. ఉన్నావ్ బాధితురాలి తల్లికి టిక్కెట్!

Priyanka

UP Election: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ మధ్య పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నుంచి 125 మంది అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో 40 శాతం మంది మహిళలకు, 40శాతం మంది యువతకు టిక్కెట్లు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.

అంతేకాదు.. మొదటి జాబితాలో అతి సామాన్యులకు టిక్కెట్లను కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. జాబితాను విడుదల సమయంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘మా జాబితాలో ఉన్న మహిళల్లో కొందరు జర్నలిస్టులు, మరికొందరు హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు, సామాజిక కార్యకర్తలు, అపారమైన అఘాయిత్యాలకు గురైన మహిళలు ఉన్నారు.

మా ఉన్నావ్ అభ్యర్థి ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి తల్లి. వారి పోరాటాన్ని కొనసాగించేందుకు వారికి అవకాశం కల్పించేందుకే ఆమెకు సీటు కేటాయించామని చెప్పారు ప్రియాంకా గాంధీ. తన కూతురిని ఏ అధికారం ద్వారా హింసించారో, ఆమె కుటుంబం ఎలా నాశనం అయిందో.. అదే అధికారాన్ని ఆమె కూడా పొందాలి అనే ఉద్ధేశ్యంతో సీటు కేటాయించినట్లు చెప్పారు ప్రియాంకా గాంధీ.

సోన్‌భద్ర మారణకాండ బాధితుల్లో ఒకరైన రామరాజ్ గోండ్‌కు కూడా మేము టిక్కెట్ ఇచ్చాము. అదేవిధంగా, ఆశా సోదరీమణులు కరోనా సమయంలో చాలా బాగా పనిచేశారు. వారిలో ఒకరైన పూనమ్ పాండేకి కూడా టిక్కెట్ ఇచ్చాం.

యూపీ కాంగ్రెస్ తొలి జాబితాలో పెద్ద పేర్లు:

అజయ్ కుమార్ లల్లు – తమ్కుహిరాజ్
ఆరాధనా మిశ్రా- రాంపూర్ ఖాస్
అజయ్ రాయ్ – పిండ్రా
వివేక్ బన్సాల్ – కోయిల్
ప్రదీప్ మాథుర్ – మధుర
అజయ్ కపూర్ – కిద్వాయ్ నగర్
అనుగ్రహ నారాయణ్ సింగ్ – అలహాబాద్ నార్త్
తనూజ్ పునియా – జైద్పూర్
అఖిలేష్ ప్రతాప్ సింగ్ – రుద్రపూర్
లూయిస్ ఖుర్షీద్ – ఫరూఖాబాద్
ఆశా సింగ్- ఉన్నావ్ (రేప్ బాధితురాలి తల్లి)
సదాఫ్ జాఫర్ – లక్నో సెంట్రల్(CAA-NRC వ్యతిరేక ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు)
పూనమ్ పాండే- షాజహాన్‌పూర్(ఆశా కార్యకర్త)