UP Election : యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను ఎంఐఎం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రకటించారు. పలు స్థానిక పార్టీలతో పొత్తు

UP Election : యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

Up (2)

UP Election : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను ఎంఐఎం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రకటించారు. పలు స్థానిక పార్టీలతో పొత్తు కుదుర్చుకునే విషయంపైనా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే స్థానిక పార్టీలతో పొత్తు ఉంటుందా లేదా అన్నది కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల్లో గెలుపు మాత్రం తథ్యమని ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ఇతర పార్టీలతో పొత్తు కోసం మొదటి నుంచీ ప్రయత్నాలు చేశారు ఒవైసీ. అయితే, ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తొలుత పెద్ద పార్టీలపైనే దృష్టిసారించి చిన్న పార్టీలను దూరం చేసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ(BSP)తో కూటమి ఏర్పాటు చేయాలని భావించారు ఒవైసీ. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి కూటమి అంశాన్ని బహిరంగంగానే కొట్టిపారేశారు. ఆ తర్వాత ఓంప్రకాశ్ రాజ్​భర్​తో కలిసి ‘భాగీదారీ సంకల్ప్ మోర్చా’ పేరుతో కూటమి ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే, చివరి క్షణంలో సమాజ్​వాదీ పార్టీతో చేతులు కలిపిన రాజ్​భర్.. ఒవైసీకి హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఏకాకిగా మిగిలిపోయారు ఒవైసీ.

ఇక, దళితులు, ముస్లింల ఓట్లనే లక్ష్యంగా చేసుకొని యూపీ ఎన్నికల బరిలో దిగుతోంది ఎంఐఎం. యూపీ జనాభాలో 40 శాతానికి పైగా వాటా ఈ రెండు సామాజిక వర్గాలదే. వీరంతా సమాజ్​వాదీ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్నారు. మజ్లిస్ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువగా నష్టపోయేది ఎస్పీనే.

ALSO READ Shyam Singha Roy: ఫ్యాన్స్‌తో నానీ.. శ్యామ్ కోసం సరికొత్త ప్రమోషన్!