UP Election Results: యోగి చేతులమీదుగా బీజేపీకి 7రికార్డులు

పేరుకు మాత్రమే ప్రత్యర్థులు.. విజయం ఏకపక్షమై పిలిచింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ రావాలని రాష్ట్రంలో 2/3వ వంతు మంది కోరిన ఆకాంక్ష నెరవేరింది. ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్..

UP Election Results: యోగి చేతులమీదుగా బీజేపీకి 7రికార్డులు

Yogi Adithynath

UP Election Results: పేరుకు మాత్రమే ప్రత్యర్థులు.. విజయం ఏకపక్షమై పిలిచింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ రావాలని రాష్ట్రంలో 2/3వ వంతు మంది కోరిన ఆకాంక్ష నెరవేరింది. ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ సీట్ నుంచి పోటీ చేసిన యోగి విజయం దక్కించుకోవడమే కాకుండా పలు రికార్డులు సొంతం చేసుకున్నారు.

బీజేపీ, ఆదిత్యనాద్‌లు కనీసం ఏడు రికార్డులను కొట్టేశారు.

తొలి సీఎంగా
అసెంబ్లీ ఏర్పాటైన 1952 మే 20 నుంచి 70ఏళ్లుగా 21సీఎంలు మారారు. ఏడు దశాబ్దాలలో ఒక్క సీఎం కూడా పూర్తి పదవీ కాలం అధికారంలో ఉండలేకపోయారు. అలాంటిది యోగి ఆదిత్యనాథ్ పూర్తిగా ఐదేళ్లు పాలించి వరుసగా రెండోసారి కూడా గెలిచారు.

రెండో సారి సీఎంగా
ఆదిత్యనాధ్ తో కలిపి యూపీలో రెండోసారి సీఎంగా గెలిచింది ఐదుగురు మాత్రమే. మిగిలిన వాళ్లు 1957లో సంపూర్ణానంద, 1962లో చంద్రభాను గుప్తా, 1974లో హేమావతి నందన్ బహుగుణ, 1985లో నారాయణ్ దత్ తివారీ.

Yogi Adityanath

Yogi Adityanath

37ఏళ్లలో
సమైఖ్య యూపీలో 1985వ సంవత్సరం ఎన్డీ తివారీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఎన్డీ తివారీ గెలిచి కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలో నిలబెట్టారు. ఆ తర్వాత రెండోసారి సీఎంగా ఈ 37ఏళ్లలో గెలిచింది యోగి మాత్రమే.

అధికారంలో తొలి సీఎంగా
యూపీ చరిత్రలో ఇప్పటివరకూ నలుగురు బీజేపీ సీఎంలు అధికారంలో ఉన్నారు. కల్యాణ్ సింగ్, రామ్ ప్రకాశ్ గుప్తా, డిఫెన్స్ మినిష్టర్ రాజనాథ్ సింగ్ ల తర్వాత ఆదిత్యనాధ్. వారెవ్వరూ రెండోసారి అధికారం దక్కించుకోకపోగా అలా చేయగలిగిన తొలి బీజేపీ సీఎం యోగి మాత్రమే.

తొలి ఎమ్మెల్యే సీఎంగా:
రెండోసారి యోగి ప్రమాణ స్వీకారం చేస్తే అలా సీఎం అయిన తొలి ఎమ్మెల్యే సీఎంగా నిలుస్తారు యోగి. ఆయన కంటే ముందు మాయావతి ఎమ్మెల్సీగా 2007లో, 2012లో సీఎంగా చేశారు. అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్సీగా 2012 నుంచి 2017వరకూ సీఎం బాధ్యతలు వహించారు.

Yogi Adithynath

Yogi Adithynath

మూడో సీఎంగా
70ఏళ్లలో 21సీఎంలు మారిన యూపీలో పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకుంది ముగ్గురు సీఎంలు మాత్రమే. వారిలో యోగి ఒకరు. అంతకంటే ముందు బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన సుప్రిమో మాయావతి (2007-2012), సమాజ్ వాదీ ప్రెసిడెంట్ అఖిలేశ్ యాదవ్ (2012-2017)వరకూ సేవలందించారు.

NOIDA jinx సెంటిమెంట్ బ్రేక్ చేసి
సీఎంగా ఉన్న పదవీ కాలంలో న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అయిన ఇండస్ట్రియల్ సిటీకి వెళ్లిన సీఎం తిరిగి అధికారంలోకి రాలేదు. కొందరు పదవీ కాలం పూర్తవకుండానే అధికారాన్ని కోల్పోయారు. అటువంటి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ రెండోసారి భారీ మెజారిటీతో దూసుకెళ్లారు యోగి ఆదిత్యనాథ్.

.

Cm Yogi