UP Bus Accident : యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు బీభత్సం.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్నూర్‌లో ఆదివారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు.

UP Bus Accident : యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు బీభత్సం.. ఆరుగురు మృతి

Up Electric Bus Mows Down B

UP Road Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్నూర్‌లో ఆదివారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాన్పూర్ టాటా మిల్ చౌరస్తా వద్ద అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. క్లాక్ టవర్ నుంచి తత్మిల్ వైపు వేగంగా దూసుకెళ్తున్న బస్సు వంతెనపై నుంచి కిందికి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. బస్సు ఎదురుగా వచ్చే మరో 10 వాహనాలను ఢీకొట్టింది.

ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ముందుగా వస్తున్న ఆటోను బస్సు ఢీకొనగా.. ఆ వెంటనే మరో రెండు కార్లను ఢీకొట్టింది. రెండు బైకులు, స్కూటీని కూడా బస్సు ఢీకొట్టింది. అప్పటికి ఆగని వేగంతో బస్పు ట్యాట్ మిల్ సెంటర్ సిగ్నల్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి.. ట్రాఫిక్ బూత్ పైకి దూసుకెళ్లింది. బస్సు ఆగిన వెంటనే అందులో నుంచి డ్రైవర్ పరారయ్యాడు. బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. యూపీలో ప్రమాద ఘటనపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


చనిపోయిన కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. ‘కాన్పూర్‌లో రోడ్డు ప్రమాదం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని ప్రియాంక హిందీలో ట్వీట్ చేశారు.

Read Also : Corona Update: తగ్గుతున్న కరోనా కేసులు, కలవరపెడుతున్న మరణాలు