Trishul,Vajra : భారత ఆర్మీ చేతికి త్రిశూల్,వజ్ర..చైనా దెయ్యం వదిలించేందుకు కొత్త ఆయుధాలు రెడీ

సరిహద్దుల్లో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా దెయ్యం వదిలించేందుకు భారత్ "త్రిశూలంతో" రెడీగా ఉంది. గతేడాది గల్వాన్‌ వ్యాలీలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో చైనా

Trishul,Vajra : భారత ఆర్మీ చేతికి త్రిశూల్,వజ్ర..చైనా దెయ్యం వదిలించేందుకు కొత్త ఆయుధాలు రెడీ

Weapons

Trishul,Vajra సరిహద్దుల్లో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా దెయ్యం వదిలించేందుకు భారత్ “త్రిశూలంతో” రెడీగా ఉంది. గతేడాది గల్వాన్‌ వ్యాలీలో భారత సైన్యంపై ఇనుప రాడ్ల తరహా ఆయుధాలతో చైనా ఆర్మీ దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. అప్పుడు చైనా బలగాల దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత బలగాలు ఇప్పుడు నూతన ఆయుధాలను సమకూర్చుకున్నాయి. భారత ఆర్మీ నూతన ఆయుధాల పేర్లు “త్రిశూల్ మరియు వజ్ర”.

కాగా,సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలు వినియోగించకూడదని ఇరు దేశాల(భారత్-చైనా)మధ్య ఒప్పందం ఉన్న నేపథ్యంలో గల్వాన్ ఘర్షణ తర్వాత ప్రాణహాని లేని ఆయుధాలపై భద్రతా బలగాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా నోయిడాలోని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ కంపెనీకి ఈ ఆయుధాలను తయారుచేసే బాధ్యతను అప్పగించారు.

ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేలా ప్రాణహాని లేని విధంగా పరమ శివుడి చేతిలోని త్రిశూలం ఆధారంగా “త్రిశూల్”మరియు “వజ్రా” పేరుతో ఆయుధాలను అపాస్టెరాన్ కంపెనీ తయారు చేసింది. గల్వాన్‌ ఘర్షణలో చైనా ఆర్మీ తమ సంప్రదాయ ఆయుధాలను వాడారని.. అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారు చేశామని అపాస్టెరాన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ తెలిపారు. త్రిశూలం నుంచి విద్యుత్‌ సరఫరా అవుతుందని.. దాని వల్ల ప్రత్యర్థి సెకన్లలోనే షాక్​కు గురవుతాడని తెలిపారు.

వజ్ర పేరుతో మెటల్ రాడ్ టేజర్‌ను కూడా ఈ సంస్థ అభివృద్ధి చేసింది. శత్రు సైనికులతో హ్యాండ్ టు హ్యాంట్ పోరాటంతో పాటు వారి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను పంక్చర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మోహిత్ కుమార్ తెలిపారు.

ఇక, సప్పర్ పంచ్ అనే పేరుతో కొత్తగా రూపొందించిన ప్రొటెక్షన్ గ్లౌజులుగా తొడుక్కొని ఒక్క పంచ్‌ ఇస్తే.. శత్రు సైనికుడు మూర్చపోవాల్సిందేనని తెలిపారు. ఈ గ్టౌజ్ ల నుంచి కూడా విద్యుత్‌ సరఫరా అవుతుందని.. దాని వల్ల ప్రత్యర్థి సెకన్లలోనే షాక్​కు గురవుతాడని తెలిపారు. అయితే ఈ ఆయుధాలేవి శత్రువు ప్రాణాలు తీయవని.. కేవలం వారిని షాక్​కు మాత్రమే గురిచేస్తాయని తెలిపారు. భారత భద్రతా బలగాలకు ఈ ఆయుధాలను అందించడం ప్రారంభించినట్లు తెలిపారు.