Ganga : గంగానదిలో కొట్టుకొచ్చిన పెట్టెలో చంటిబిడ్డ..! పాప పేరు ’గంగ’

మహభారతంలో కర్ణుడుని తల్లి కుంతీదేవి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసిన ఘటన గురించి తెలిసిందే. కానీ ఈరోజుల్లో కూడా అటువంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్ లో. ఓచంటిబిడ్డను ఓ చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ చెక్కపెట్టెలో చంటిబిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా ఉంది. నదిలో కొట్టుకొస్తున్న ఓ పెట్టెను కూడా ఒడ్డుకు చేరిన స్థానికులు దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ పెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఓ చంటిబిడ్డతో పాటు అమ్మవారి ఫోటో కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

Ganga : గంగానదిలో కొట్టుకొచ్చిన పెట్టెలో చంటిబిడ్డ..! పాప పేరు ’గంగ’

New Born Baby Girl Found Floating In A Box In Ganga River

new born baby girl found floating in a box in ganga river : మహభారతంలో కర్ణుడుని తల్లి కుంతీదేవి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసిన ఘటన గురించి తెలిసిందే. కానీ ఈరోజుల్లో కూడా అటువంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్ లో. ఓచంటిబిడ్డను ఓ చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ చెక్కపెట్టెలో చంటిబిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా ఉంది. నదిలో కొట్టుకొస్తున్న ఓ పెట్టెను కూడా ఒడ్డుకు చేరిన స్థానికులు దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ పెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఓ చంటిబిడ్డతో పాటు అమ్మవారి ఫోటో కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. మరి ఆ బిడ్డ తల్లే అలా చంటిబిడ్డను చెక్క‌పెట్టెలో ఉంచి గంగానదిలో ప‌డేసిందా? లేక మరెవరైనా చేశారా? అనేది మాత్రం తెలియలేదు. ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చుట్టూతా చూశాడు.ఎక్కడా చంటిబిడ్డ జాడలేదు.కానీ ఏడుపులు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో పరిశీలించి చూడగా..నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకువస్తుండటం చూసాడు. ఆ పెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నాయా? అనే అనుమానం వచ్చింది. అంతే ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ..నదిలోంచి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూడగా..షాక్ అయ్యాడు.

ఆ చెక్కపెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఆడ బిడ్డను పడుకోబెట్టి..దేవ‌తా ప‌ఠాన్ని కూడా పెట్టి ఉంది. ఆ బిడ్డ వయస్సు నెలరోజుల లోపు ఉంది. నావికుడి కేకలు విన్న స్థానికులు పలువురు అక్కడి చేరుకున్నారు. ఆ పెట్టెలో ఉన్న బిడ్డను చూసి అవాక్క‌య్యారు. ఆ పెట్టెలో కనకదుర్గమ్మ వారి ఫోటోతో పాటు ఓ పేపర్ కూడా ఉంది. ఆ పేపర్ లో ఆ బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం..ఆ బిడ్డకు ‘గంగ’ అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది.కాగా పెట్టెలో దొరికిన ఆడబిడ్డను గుర్తించిన నావికుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ బిడ్డను నాకు గంగమ్మే ఇచ్చింది. ఆ బిడ్డ పేరు కూడా గంగ‌ అని రాసి ఉంది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను నేను పెంచుకుంటానని చెప్పాడు.

కానీ గంగానదిలో స్థానికుడి ఓ పెట్టె దొరికిందని ఆ పెట్టలో ఆడ శిశువు ఉందని స్థానికులు పోలీసుల‌కు తెలియజేయటంతో బిడ్డ దగ్గరకొచ్చిన పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఆ పాపను నేను పెంచుకుంటాను సార్’..అని నావికుడు చెప్పినా ‘‘అలా కుదరదు ఈ బిడ్డ ఎక్కడనుంచి వచ్చింది? ఎవరు ఇలా బిడ్డను పెట్టెలో పెట్టి వదిలేశారు? అనే విషయాలను మేం దర్యాప్తు చేయాలి’ అంటూ ఆ బిడ్డను పోలీసులు తీసుకెళ్లిపోయారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు. కాగా..గంగానదిలో పెట్టెలో ఓ చంటిబిడ్డ కొట్టుకొచ్చిందనే వార్త స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టాపిక్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.