దేవుడి పేరు చెప్పి..చెట్లు నరికేస్తామంటే ఊరుకోం : యూపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

  • Published By: nagamani ,Published On : December 3, 2020 / 10:17 AM IST
దేవుడి పేరు చెప్పి..చెట్లు నరికేస్తామంటే ఊరుకోం : యూపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

up gov cant cut trees for lord krishna ordered sc : దేవుడు పేరు చెప్పి పర్యావరణానికి హాని కలిగించే పనుల్ని చూస్తూ ఊరుకోబోమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థాయి అయిన సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. భగవంతుడి పేరు చెప్పి..దాదాపు 3 వేల చెట్లను నరికి వేస్తామంటే అంగీకరించేది లేదని సుప్రీంకోర్టు యూపీ సర్కార్ కు స్పష్టం చేసింది. చెట్లు నరికివేయటం అమానుషమనీ..చెట్లు ప్రాణికోటికి ప్రాణవాయువుని అందిస్తాయి..వాటి విలువను డబ్బులతో లెక్క కట్టలేం..కాబట్టి చెట్ల నరికివేత మానుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.



వివరాల్లోకి వెళితే..యూపీలోని మధుర జిల్లాలో ఉన్న ఓ శ్రీ కృష్ణ మందిరానికి వెళ్లేందుకు వీలుగా 25 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ 2,940 చెట్లను కొట్టేయాల్సి ఉందని భావించింది. ఈ చెట్లకు పరిహారంగా రూ. 138.41 కోట్ల నష్టపరిహారాన్ని ఇస్తామని..చెట్లు నరికివేయటానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.



ఈ కేసును విచారించిన ధర్మాసనం భగవంతుడి పేరుతో చెట్లను నరికివేయటాన్ని తప్పు పట్టింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొప్పన, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం చెట్లను నరికివేయటానికి ఎట్టి పరిస్థితుల్లోనే అనుమతించబోమని స్పష్టం చేసింది.



చెట్లను కొట్టివేసిన తరువాత..మరిన్ని చెట్లను నాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. కానీ మీరు చెప్పే ఈ మాటలకు ధర్మాసనం అంగీకరించదనీ తీర్పుని మార్చబోదని స్పష్టం చేసింది. 100 సంవత్సరాల వయసున్న చెట్టును తొలగించి..ఓ మొక్కను నాటడం సమానం కాదని బాబ్డే అభిప్రాయపడ్డారు.



“చెట్లు మనుషులకే కాదు సమస్త ప్రాణికోటికి ప్రాణవాయువును అందిస్తాయి. దాని విలువను లెక్కకట్టలేము…ప్రకృతి అందించే ప్రాణవాయువుని డబ్బులతో లెక్కకట్టలేమని తేల్చి చెప్పింది. చెట్ల మిగిలిన జీవిత కాలాన్ని బట్టి..విలువ మారుతుంటుంది. చెట్లను నరకడానికి ఎట్టి పరిస్థితుల్లోని అగీకరించమని వ్యాఖ్యానించింది.



దేవుడు పేరుతో ప్రకృతికి విఘాతం కలిగించే ఇటువంటి చర్యలు సరికావని చీవాట్లు పెట్టింది. ఇదే సమయంలో కృష్ణ మందిరానికి రహదారి నిర్మించే విషయంలో మరో ప్రతిపాదనతో నాలుగు వారాల్లోగా కోర్టు ముందుకు రావచ్చని పేర్కొంది.