Uttar Pradesh: వాజపేయి జయంతిని అడ్డుకున్న హెడ్‌మాస్టర్.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం

డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Uttar Pradesh: వాజపేయి జయంతిని అడ్డుకున్న హెడ్‌మాస్టర్.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Uttar Pradesh: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతిని అడ్డుకున్నందుకు ఒక హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేసింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. డిసెంబర్ 25, వాజపేయి జయంతి అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వాజపేయి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Telangana: కీలక మలుపు తిరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. విచారణ సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశం

కొన్ని చోట్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో, అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర ప్రదేశ్, ప్రయాగరాజ్ పరిధిలో ఉన్న ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం వాజపేయి జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పీయూష్ రంజాన్ నిషద్ హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమం జరుగుతుండగా, స్కూల్ హెడ్ మాస్టర్ కల్పనా త్యాగి అక్కడకు చేరుకున్నారు. తన అనుమతి లేకుండా స్కూల్‌లో కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడ ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్లే చేస్తున్నారు. కల్పన దీనికి కూడా అభ్యంతరం చెప్పారు. అయితే, దీనిపై స్పందించిన ఎమ్మెల్యే స్థానిక పంచాయతి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నందున అనుమతి అక్కర్లేదని, పైగా ఆదివారం స్కూల్‌కు సెలవు అనే ఉద్దేశంతో అక్కడ ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

ఈ అంశంపై ఎమ్మెల్యేకు, హెడ్ మాస్టర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ దశలో విద్యాశాఖ అధికారిని స్కూల్‌కు రప్పించారు. ఆయన అక్కడకు చేరుకుని ఈ ఘటనలో హెడ్ మాస్టర్‌దే తప్పని తేల్చారు. అనంతరం ఆమెను సస్పెండ్ చేశారు.