Mask Fine : మాస్కు లేదని ఏకంగా రూ.10వేలు ఫైన్, తాట తీస్తున్న పోలీసులు

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు, భారీగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందంటే, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించారు.

Mask Fine : మాస్కు లేదని ఏకంగా రూ.10వేలు ఫైన్, తాట తీస్తున్న పోలీసులు

Mask Fine

Mask Fine Rs 10,000 : దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు, భారీగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందంటే, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. మాస్క్ మస్ట్ రూల్ కూడా తెచ్చాయి. ఈ రూల్ ఉల్లంఘిస్తే ఫైన్లు కూడా వేస్తున్నారు. అయినా కొందరు వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. మాస్కు పెట్టుకోకుండా వీధుల్లోకి వస్తున్నారు.

తాజాగా మాస్కు లేని కారణంగా ఓ వ్యక్తికి అధికారులు ఏకంగా రూ.10వేలు ఫైన్ విధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియాలో ఈ ఘటన జరిగింది. మాస్కు లేని కారణంగా జరిమానా విధించబడ్డ తొలి వ్యక్తి ఇతడే. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంది యూపీ ప్రభుత్వం. మాస్కు మస్ట్ చేసింది. ఆ తర్వాతి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది.
అమర్ జిత్ అనే వ్యక్తి మాస్కు లేకుండానే బయట తిరుగుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతడికి రూ.10వేుల జరిమానా విధించారు.

కాగా, అమర్ జిత్ కు ఫైన్ విధించడం ఇది తొలిసారి కాదు. కొన్ని రోజుల క్రితం మాస్కు లేకుండా బయట తిరుగుతున్న అతడికి పోలీసులు వెయ్యి రూపాయలు ఫైన్ వేశారు. అయినా అతడికి బుద్ధి రాలేదు. మళ్లీ అలాగే మాస్కు లేకుండా బయట తిరుగుతున్నాడు.

”సోమవారం(ఏప్రిల్ 19,2021) అమర్ జిత్ మాస్కు లేకుండా లార్ దగ్గర కనిపించాడు. వెంటనే అతడికి 10వేల రూపాయలు ఫైన్ వేశాము. అంతకుముందు అంటే ఏప్రిల్ 18న కూడా ఇలానే మాస్కు లేకుండా బయట తిరుగుతున్న అతడికి వెయ్యి రూపాయలు ఫైన్ వేశాము. మరోసారి మాస్కు లేకుండా బయటకు రావొద్దని హెచ్చరించాము. అలాగే అతడికి మాస్కు కూడా ఇచ్చాము. అని అతడిలో మార్పు లేదు” అని లార్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ టిజే సింగ్ తెలిపారు.

”మేము ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాము. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడటం వారి బాధ్యత. మాస్కు లేకుండా తిరుగుతున్న వారికి తొలిసారి వార్నింగ్ ఇస్తాం. అలాగే వెయ్యి రూపాయలు జరిమానా వేస్తాం. ఆ తర్వాత కూడా వారి తీరు మారకుంటే, మాస్కు లేకుండా రెండోసారి పట్టుబడితే మాత్రం రూ.10వేలు ఫైన్ విధిస్తున్నాం” అని డియోరియా ఎస్పీ శ్రీపతి మిశ్రా తెలిపారు.