Uttar Pradesh: చెత్తలో పడి ఉన్న ప్రధాని, యూపీ సీఎం ఫొటోలు.. జాబ్ కోల్పోయిన ఉద్యోగి

ఉత్తరప్రదేశ్ మధురలోని ఓ చెత్తకుండీలో ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి జాబ్ కోల్పోయాడు. ఫ్రేమ్ చేసి ఉన్న ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ఫొటోలు చెత్తలో ఉన్నాయని చూపిస్తూ వీడియో తీశాడు. ఆ వ్యక్తి చెత్తబండిని తోసుకెళ్తూ కనిపించాడు.

Uttar Pradesh: చెత్తలో పడి ఉన్న ప్రధాని, యూపీ సీఎం ఫొటోలు.. జాబ్ కోల్పోయిన ఉద్యోగి

Waste Cart

 

 

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ మధురలోని ఓ చెత్తకుండీలో ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి జాబ్ కోల్పోయాడు. ఫ్రేమ్ చేసి ఉన్న ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ఫొటోలు చెత్తలో ఉన్నాయని చూపిస్తూ వీడియో తీశాడు. ఆ వ్యక్తి చెత్తబండిని తోసుకెళ్తూ కనిపించాడు.

“వీటితో నాకేమీ సంబంధం లేదు. చెత్తబుట్టలో ఉన్నాయి కాబట్టి వాటిని నా బండిలో వేసుకున్నా. ఇందులో ఏపీజే అబ్దుల్ కలాం ఫొటో కూడా ఉంది” అని ఆ వ్యక్తి చెబుతున్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి.

ఆ తర్వాత వీడియో తీసిన కొంతమంది అభిమానులు.. “మేం ఈ ఫొటోలను మాతో గుజరాత్ లోని అల్వార్ కు తీసుకెళ్తున్నాం. మోదీ, యోగి లాంటి వారు ఈ దేశానికి ఆత్మలాంటి వారని” అభిప్రాయపడ్డారు.

Read Also : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి

ఇక పోస్టు చేసిన వీడియోపై సోషల్ మీడియాలో పలు రకాల స్పందనలు వినిపిస్తున్నాయి. “ఇది తప్పు, సీఎం అనేది రాజ్యాంగబద్దమైన పదవి, అందరూ గౌరవించాలి” అని ఒకరంటుంటే, ఫొటోలు ఎవరిదైనా పాతపడిపోతాయి కదా.. కాకపోతే ఇటువంటి వారి ఫొటోలను పారేయడానికి వేరే ప్రక్రియ ఉంటుందా” అని మరొకరు సందేహం లేవనెత్తారు.

ఆ వ్యక్తి తన చెత్తకుండీలో ఫొటోలను తెలియకుండానే పెట్టినప్పటికీ.. అతనిపై చర్య తీసుకున్నాం. తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించామని నగర్ నిగమ్ మధుర బృందావన్ అదనపు మునిసిపల్ కమిషనర్ సత్యేంద్ర కుమార్ తివారీ తెలిపారు.