UP : హిందూ దేవతలున్న పేపర్లలో మాంసం ప్యాకింగ్ చేస్తున్న ముస్లిం..అరెస్ట్ చేసిన పోలీసులు

హిందూ దేవతలున్న పేపర్లలో మాంసం ప్యాకింగ్ చేస్తున్న ముస్లిం వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

UP : హిందూ దేవతలున్న పేపర్లలో మాంసం ప్యాకింగ్ చేస్తున్న ముస్లిం..అరెస్ట్ చేసిన పోలీసులు

Up Man Sells Chicken Wrapped In Paper With Pictures Of Hindu Deities (1)

UP : యూపీలోని సంభాల్ లో మాంసం వ్యాపారం చేసే ఓ ముస్లింను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ దేవతల చిత్రాలున్న పేపర్లలో చికెన్ ప్యాకింగ్ చేసిన అమ్ముతున్నాడు. దీంతో కొంతమంది చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యాపారి షాపు వద్దకు వెళ్లగా..పోలీసులపై మాంసం వ్యాపారి కత్తితో దాడి చేయబోయాడు.దీంతో పోలీసులు అతనికి అరెస్ట్ చేశారు.

తాలీబ్ హుస్సేన్ అనే వ్యాపారి హిందూ దేవతలు..దేవుళ్లు ఫోటోలు ఉన్న పేపర్లలో చికెన్ ప్యాక్ చేసి అమ్ముతున్నాడని అదేమని ప్రశ్నించినా ఏమాత్రం లక్ష్య పెట్టటంలేదని మత మనోభావాలను గాయపరుస్తున్నాడంటూ కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫిర్యాదు గురించి ఆరా తీయటానికి తాలీబ్ హుస్సేన్ షాపులో తనిఖీకి వెళ్లగా..అతను కత్తితో పోలీసులపైకి అతడు దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ సెక్షన్ 153-ఏ, సెక్షన్ 295ఏ, సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.

కాగా..భారత్ కు భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం గల దేశంలో పేరుంది. మతపరమైన అంశాలు ఎన్నున్నా భారతీయులంతా ఎన్నో సందర్భాల్లో మత సామారస్యంతో జీవిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం మతాలు..కులాల మధ్య విద్వేషాలు రేపేందుకు యత్నిస్తుంటారు. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించటం..పనులు చేయటం చేస్తుంటారు. ఇలీవల కాలంలో పరమత దేవుళ్ల పట్ల ద్వేష భావం, చులకన భావం పెరిగిపోతున్న తీరు ఎక్కువగా వెలుగులోకి వస్తోంది. ఇందుకు సంబంధించి పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజస్థాన్, మహారాష్ట్రలో హిందువుల తలలు తెగనరకడం, కాళికా మాత నోట్లో సిగరెట్ తో పోస్టర్ ఇలా ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.