Uttar pradesh: మంత్రిని కరిచిన ఎలుక.. పాము అనుకొని..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎలుక మంత్రి, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. యూపీ క్రీడల శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ అధికార పర్యటన నిమిత్తం ఆదివారం రాష్ట్రంలోని బండా జిల్లాకు వెళ్లారు...

Uttar pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎలుక మంత్రి, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. యూపీ క్రీడల శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ అధికార పర్యటన నిమిత్తం ఆదివారం రాష్ట్రంలోని బండా జిల్లాకు వెళ్లారు. పేదలకు మెరుగైన పాలన అందేలా, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని, ఇందుకోసం మీకు కేటాయించిన ప్రాంతాల్లో నిత్యం పర్యటించాలని ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రులకు సూచించారు. అంతేకాదు అధికారిక కార్యక్రమాల సమయంలో మంత్రులు, అధికారులు ప్రైవేట్ హోటళ్లకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లలో మాత్రమే సేదతీరాలని యోగి ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.
Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం
సీఎం ఆదేశాలతో మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ బండా జిల్లాలో ఆదివారం పర్యటించారు. రాత్రి బండాలోని ప్రభుత్వ అతిథిగృహంలో బస చేశారు. సోమవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో కుడిచేతి వేలు నొప్పిగా ఉండటంతో అకస్మాత్తుగా నిలేచిన మంత్రి తనకు ఏదో విషపు పురుగు కరించిందని భావించారు. ఏదో కరిచినట్లు ఉండటంతో పాటు, రక్తపు చుక్కను గమనించి పాము కరిచిందేమోనన్న అనుమానంతో వెంటనే కార్యకర్తలు, అధికారులకు సమాచారం అందించారు. జిల్లా మెజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో సహా సీనియర్ జిల్లా అధికారులు గెస్ట్ హౌస్ కు చేరుకొని హుటాహుటీన మంత్రిని ఆస్పత్రికి తరలించారు.
Uttarpradesh : యోగి 7 రికార్డులు..పూర్తి వివరాలు
జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎన్ మిశ్రా పర్యవేక్షణలో వైద్యులు చికిత్స ప్రారంభించారు. పలు పరీక్షల అనంతరం చివరకు ఎలుక కొరికిందని నిర్దారించడంతో మంత్రితోపాటు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి బసచేసిన గెస్ట్ హౌస్ చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో తొలుత పాము కరిచి ఉంటుందని మంత్రి భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో సిబ్బంది గెస్ట్ హౌస్ అన్ని గదులు గాలించి ఎలుకను పట్టుకున్నారు. అయితే చికిత్స అనంతరం సోమవారం ఉదయం 6గంటల సమయంలో వైద్యులు మంత్రిని డిశ్చార్జి చేశారు.
- Dera Baba: జైలు నుంచి విడుదల కానున్న డేరా బాబా.. నెల రోజుల పెరోల్
- Supreme Court: బుల్డోజర్లతో భవనాల కూల్చివేతలపై స్టే ఇవ్వలేం: సుప్రీంకోర్టు
- UP Demolitions: యూపీలో కూల్చివేతలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Uttar Pradesh: నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ మీద పడి ప్రాణాలు కోల్పోయిన తల్లీకూతురు
- Uttar Pradesh: హెలికాప్టర్లతో ఆందోళనలను పసిగట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
1Vijay66: అదిరిపోయే టైటిల్‌తో తిరిగొచ్చిన బాస్!
2Maha Vikas Aghadi : ప్రమాదంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం..శివసేన రెబెల్ క్యాంప్ లో పెరుగుతున్న ఎమ్మెల్యేలు
3OnePlus Nord 2T : ఈ నెలాఖరులో ఇండియాకు వన్‌ప్లస్ Nord 2T ఫోన్.. ఏం ఫీచర్లు ఉండొచ్చుంటే?
4Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. వైసీపీ-బీజేపీల మధ్యే పోటీ
5Jobs : ఐసీఎస్ఐ లో సీఆర్సీ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీ
6Indian Navy : ఇండియన్ నేవీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ
7Tongue Scraping: టంగ్ క్లీనింగ్‌తో ఇన్ని లాభాలా..!
8Yashwant Sinha : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
9Xiaomi 12 Series : షావోమీ నుంచి 12S సిరీస్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
10Adah Sharma: యోగాసనాలతో ఫిదా చేస్తున్న అదా!
-
TRS Support : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..ఆయనకే గులాబీ మద్దతు!
-
Sammathame: సెన్సార్ పనులు ముగించుకున్న సమ్మతమే
-
Best Smartphones : రూ. 30వేల లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
-
Telugu Film Industry: టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్.. సమ్మె సైరెన్ మోగించనున్న సినీ కార్మికులు
-
Beat Root : ఇన్ ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడే బీట్ రూట్!
-
Potatoes : బంగాళ దుంపలు తింటే బరువు పెరుగుతారా?
-
Tumors : గర్భదారణకు అడ్డంకిగా గర్భసంచిలో గడ్డలు!
-
SALT : ఉప్పు మోతాదుకు మించితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయా?