గడ్డం పెంచుకున్నందుకు ఎస్సై సస్పెండ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2020 / 04:11 PM IST
గడ్డం పెంచుకున్నందుకు ఎస్సై సస్పెండ్

cop suspended for keeping beard without permission గడ్డం చేసుకోనందుకు ఓ సబ్ ఇన్స్ పెక్టర్(SI)ని సస్పెండ్‌ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా గడ్డం పెంచుకోవటం ద్వారా డ్రస్ కోస్ నిబంధనలు ఉల్లంఘించినందుకు భాగ్ పేట జిల్లాలోని రమలా పోలీస్ స్టేషన్ ఎస్సై సస్పెండ్ కు గురయ్యారు.



ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పేట జిల్లాలోని రమలా పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఇస్తార్ అలీ బాగ్‌పత్‌ ని గడ్డం చేయించుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే మూడు సార్లు ఆదేశించారు. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. ఈ క్రమంలో గురువారం ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ సందర్బంగా బాగ్‌పత్‌ ఎస్పీ అభిషేక్‌ సింగ్‌ మాట్లాడుతూ….పోలీస్ డ్రెస్ కోడ్ మాన్యువల్‌ ప్రకారం… కేవలం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకోవడానికి అనుమతి ఉంది.



https://10tv.in/armed-police-training-centre-official-arrested-for-raping-woman-constable-trainee-assam/
మిగతావారందరూ నీట్‌గా గడ్డం చేయించుకోవాల్సిందే. ఒకవేళా గడ్డం ఉంచుకోవాలనుకుంటే అతను దాని కోసం అనుమతి తీసుకోవాలి. ఈ క్రమంలో ఇంటెసర్‌ అలీని పదే పదే అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించాము. అతడు దానిని పాటించలేదు.. అనుమతి లేకుండా గడ్డం ఉంచుకున్నాడు. ఇదే విషయమై ఇంతకుముందు కూడా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయబడింది. క్రమశిక్షణారాహిత్యం కారణంగా అలీని బుధవారం సస్పెండ్‌ చేయడం జరిగింది. అలీపై విచారణకు కూడా ఆదేశించినట్లు బాగ్‌పత్‌ ఎస్పీ తెలిపారు.



మరోవైపు, తాను గడ్డం ఉంచడానికి అనుమతి కోరుతూ తాను గతేడాది నవంబర్ లోనే దరఖాస్తు చేసుకున్నానని,కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని సస్పెండ్ అయిన SI అలీ తెలిపారు. 1994లో తాను కానిస్టేబుల్ గా చేరానని…25ఏళ్లుగా తాను సర్వీసులో ఉన్నానని…ఇప్పటివరకు ఎవ్వరూ తనను గడ్డం పెంచకుండా అడ్డుకోలుదని అలీ తెలిపారు.