UP Phase 1 Polls : యూపీలో ముగిసిన తొలి ద‌శ పోలింగ్.. 58 శాతం న‌మోదు!

ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. యూపీలో మొద‌టి ద‌శ పోలింగ్ గురువారం (ఫిబ్రవరి 10) ఉద‌యం 7.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది.

UP Phase 1 Polls : యూపీలో ముగిసిన తొలి ద‌శ పోలింగ్.. 58 శాతం న‌మోదు!

Phase 1 Polling Ends For 58

UP Phase 1 Polls :  ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. యూపీలో మొద‌టి ద‌శ పోలింగ్ గురువారం (ఫిబ్రవరి 10) ఉద‌యం 7.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. క‌ట్టుదిట్ట‌మైన భద్ర‌తా ఏర్పాట్ల మ‌ధ్య యూపీలో పోలింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 6:30 గంట‌ల త‌ర్వాత ఈ పోలింగ్ ముసిగింది. 58 స్థానాల్లో 2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు.

మొదటి విడత పోలింగ్ ముగిసే స‌మ‌యానికి పోలింగ్ శాతం 58 శాతంగా న‌మోదైంది. అలీగ‌ఢ్‌లో 57.25 శాతం, ఆగ్రాలో 56.52 శాతం, భ‌గ్‌పాత్ 61.25 శాతం, బులంద‌ర్‌షాలో 60.57 శాతం, జీబీ న‌గ‌ర్‌లో 53.48 శాతం, ఘ‌జియాబాద్‌లో 52.43 శాతం, హాపూర్‌లో 60.53 శాతం, మ‌థుర‌లో 58.12 శాతం, మీర‌ట్‌లో 58.23 శాతం, ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో 62.09 శాతం, షామ్లిలో 61.75 శాతం పోలింగ్ న‌మోదైంది.

పలుచోట్ల స్వల్ప ఘర్షణలు.. మెరాయించిన ఈవీఎంలు :
యూపీలో మొద‌టి ద‌శ పోలింగ్ ప్ర‌శాంతంగానే జరగగా.. కొన్ని చోట్ల మాత్రం స్వ‌ల్ప ఘ‌ర్ష‌ణలు చోటుచేసుకున్నాయి. ష‌మ్లిలో ఆర్జేడీ, బీజేపీల మ‌ధ్య స్వ‌ల్ప ఘ‌ర్ష‌ణ జరిగింది. బోగ‌స్ ఓటింగ్ ఆరోప‌ణ‌ల‌తో ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. పోలీసులు రంగప్రవేశంతో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కొత్త ఈవీఎంల‌ను అమ‌ర్చారు.

కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు పనికిరాకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 7 వ‌ర‌కూ యూపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం.. యూపీలో ఇప్పటి వరకు 57.79శాతం ఓటింగ్ నమోదైంది.

11 జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతం..

అలీఘర్ – 57.25 శాతం
ఆగ్రా- 56.52శాతం
బాగ్‌పత్- 61.25శాతం
బులంద్‌షహర్- 60.57శాతం
GB నగర్- 53.48శాతం
ఘజియాబాద్- 52.43శాతం
హాపూర్ – 60.53శాతం
మధుర- 58.12శాతం
మీరట్- 58.23శాతం
ముజఫర్‌నగర్- 62.09శాతం
షామ్లీ- 61.75శాతం

Read Also : Tollywood Mega Meeting: సీఎం జగన్ ఇచ్చిన భరోసాతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం – చిరంజీవి