Phoolan Devi: ప్రతిష్టాపనకు ముందే పూలన్ దేవీ విగ్రహం సీజ్

పూలన్‌దేవీ వర్థంతి సందర్భంగా విగ్రహం ప్రతిష్టించాలని అనుకుంటుండగానే పోలీసులు దాన్ని సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు వచ్చిన బీహార్ మంత్రి ముకేశ్ సహానీని వారణాసి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు.

Phoolan Devi: ప్రతిష్టాపనకు ముందే పూలన్ దేవీ విగ్రహం సీజ్

Phoolan Devi

Phoolan Devi: పూలన్‌దేవీ వర్థంతి సందర్భంగా విగ్రహం ప్రతిష్టించాలని అనుకుంటుండగానే పోలీసులు దాన్ని సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు వచ్చిన బీహార్ మంత్రి ముకేశ్ సహానీని వారణాసి ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. లోక్ సభ మాజీ ఎంపీకి చెందిన విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్లాట్ ఫాం ఏర్పాటుచేశారని పోలీస్ సూపరింటెండెంట్ రామ్ బదన్ సింగ్ అన్నారు.

ఈ కార్యక్రమం మొత్తాన్ని వికాస్‌సీల్ ఇన్సాన్ పార్టీ నిర్వహించింది. బీజేపీ కులతత్వ ఆలోచనతోనే ఇలా చేసిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. భదోహీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ మాట్లాడుతూ.. ఇది ఏర్పాటు చేయడానికి ఎటువంటి అనుమతి లేదు. పైగా గ్రామ సమాజ్ కు చెందిన స్థలంలో ఏర్పాటు చేయాలని భావించారని అన్నారు.

అందుకే మంత్రిని కూడా కార్యక్రమానికి వచ్చేందుకు అనుమతించలేదని చెప్పారు ఎస్పీ. ప్రతిష్టాపించడానికి తీసుకొచ్చిన విగ్రహాన్ని మళ్లీ అక్కడికే తరలించినట్లు చెప్పారు.

బండిట్ క్వీన్ గా ఫ్యామస్ అయిన పూలన్ దేవీ 2001లోనే చనిపోయారు. సమాజ్ వాదీ అభ్యర్థిగా గెలిచి ఎంపీగా సేవలందించారు. ఆమె వర్థంతి సందర్భంగా జులై 25న వికాస్ సీల్ ఇన్సాన్ పార్టీ కార్యకర్తలు విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని భావించగా పోలీసులు దానిని వెనక్కు తీసేసుకున్నారు.