ఆ వీడియోలు చూసే వారిపై నిఘా

ఆ వీడియోలు చూసే వారిపై నిఘా

porn content users

UP Police : ప్రస్తుతం ప్రతొక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ఉపయోగిస్తూ..ఫుల్ బిజీగా మారిపోతున్నారు. అయితే..కొంతమంది అశ్లీల వీడియోలు చూస్తున్నారు. మహిళలపై నేరాల జరగడానికి ఇది ఒక కారణమని భావించిన కేంద్రం..కఠిన చర్యలు తీసుకొంటోంది. దాదాపు 827 పోర్న్ సైట్లను భారత్ లో నిషేధించింది. ఫోర్న్ నిషేధించడం సరైన చర్య కాదనే వాదన వినిపించింది. తాజాగా..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం..ఇంటర్నెట్ సెర్చింగ్ డేటాపై నిఘా పెట్టనుంది. సెర్చ్ ఇంజిన్ లో పోర్న్ వీడియోల కోసం సెర్చ్ చేస్తే..వెంటనే ఆ సమాచారం తమకు తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇందుకు Oomuph అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. ‘యూపీ విమెన్ పవర్లైన్ 1090′ అనే కొత్త పోలీస్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు, దీనితో ఎవరైనా పోర్న్ కోసం సెర్చ్ చేయగానే మెసేజ్ వస్తుందని ఆ వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారని అన్నారు. సైట్లను వీక్షిస్తున్న వారి డేటా బేస్ రూపొందిస్తున్నట్లు, మహిళలుపై నేరాలు జరిగినప్పుడు ఆ డేటా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా..దీనిని చేపట్టినట్లు, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తామని, ఒక్క యూపీలోని 11.6 మిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారని తెలిపారు.