పెళ్లిరోజే కూలిన ఇల్లు..వధువు వెన్నెముకకు గాయాలు..నీకునేనున్నానంటూ పెళ్లి చేసుకున్న వరుడు

పెళ్లిరోజే కూలిన ఇల్లు..వధువు వెన్నెముకకు గాయాలు..నీకునేనున్నానంటూ పెళ్లి చేసుకున్న వరుడు

UP prayagraj couple ties knot hours after bride injures back : పెళ్లి చేసుకుని కట్నకానులకు ఇవ్వలేదనీ..ఆస్తులు తేలేదని..ఇలా పలు కారణాలతో ఎంతోమంది జంటలు విడిపోతున్నారు. పెళ్లి అనే మాటకు అర్థం లేకుండా చేస్తున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం తను చేసుకోబోయే అమ్మాయికి వచ్చిన కష్టానికి తోడుగా నిలిచాడు. మరికొద్ది గంటల్లోనే వివాహం జరగనుంది. కానీ ఇంతలోనే ఇంటి పైకప్పు కూలి వధువుకు తీవ్ర గాయాలయ్యాయి.

వెన్నెముకకు దెబ్బతగిలిందని కోలుకోవటానికి కాస్త టైమ్ పడుతుందని డాక్టర్లు తెలిపారు. కానీ చేసుకోబోయే అమ్మాయికి గాయాలయ్యాయని తాను ఆమెను వదిలేది లేదని అనుకున్న సమయానికి వివాహం చేసుకుని ఆమెను దగ్గరుండి బాగోగులు చూసుకుంటానని తెలిపాడు.అనుకున్నట్లుగానే మంచంమీద పడుకున్న ఆమెను వివాహం చేసుకున్నాడు. హృదయానికి హత్తుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ప్రయాగరాజ్ నగరానికి చెందిన అవధేష్, ఆర్తిలకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కానీ ప్రమాదవశాత్తు పెళ్లి జరిగే రోజునే ఆర్తి వాళ్ల ఇంటి పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో వధువు ఆర్తికి వెన్నెముక, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వధువు ఆర్తిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం వరుడు అవధేష్ కు తెలిసింది. గబగబా వచ్చేశాడు.

గాయాలతో మంచంపై ఉన్న ఆమె కాబోయే భర్తను చూసి కన్నీరు పెట్టుకుంది. కారణం ఆమె వెన్నెముకకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఆమెనడవలేని స్థితిలో ఉంది. దీంతో ఆమెపరిస్థితిని అర్థం చేసుకున్న అవధేష్ ఆమెను ఓదార్చాడు. నీకు గాయాలయ్యాయని నిన్ను వదిలేది లేదు.ఎప్పుడైతే మన వివాహాన్ని పెద్దలు నిశ్చయించారో..అప్పుడే మనం భార్యాభర్తలమయ్యాం. ఇప్పుడు నీకు కష్టమొచ్చిందని వదిలేస్తానని భయపడొద్దను..అనుకున్న ముహూర్తానికే మన పెళ్లి జరుగుతుందని ధైర్యం చెప్పాడు.

అతని మాటలు విన్న ఆర్తి అప్పటి వరకూ వేదనతో ఉన్న ఆమె ముఖంలో చిరునవ్వు వెలిగిపోయింది. తనకు అంత మంచి భర్త లభించినందుకు ఎంతో సంతోషపడిపోయిందామె. నువ్వలా నవ్వుతూ ఉంటే చాలు మనం ఎప్పటికీ హ్యాపీగా ఉంటామని తాను కూడా నవ్వుతూ చెప్పాడు. ఆర్తి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లనుఅడిగి తెలుసుకున్నాడు. ఆమె మంచంమీద ఉండగానే వివాహం చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బందులున్నాయా? అని అడిగాడు.

చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని వివాహం చేసుకోవచ్చని ఆర్తికి వైద్యం చేసిన డాక్టర్ సచిన్ సింగ్ చెప్పారు. దీంతో ఆర్తి ఆసుపత్రి బెడ్ మీద ఉండగానే వివాహం చేసుకుని ఒకింటి వారయ్యారు. ఆర్తి, అవధేష్ దంపతులను కుటుంబసభ్యులు, బంధువులతో పాటు డాక్డర్లు,వైద్య సిబ్బంది ఆశీర్వదించారు. వరుడు అవధేష్ ను అభినందించారు.