Uttar Pradesh: దీపావళికి ముందుగానే అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం.. బర్న్ వార్డుల్లో ప్రత్యేక బెడ్లు సిద్ధం చేయాలని ఆదేశం!

దీపావళి సందర్భంగా కొన్ని చోట్ల ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో యూపీ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. రాబోయే పరిస్థితికి అనుగుణంగా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

Uttar Pradesh: దీపావళికి ముందుగానే అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం.. బర్న్ వార్డుల్లో ప్రత్యేక బెడ్లు సిద్ధం చేయాలని ఆదేశం!

Uttar Pradesh: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం సంప్రదాయం అనే సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా చాలా మంది గాయాలపాలవుతుంటారు. టపాసులు కాలుస్తూ చేతిలో టపాసులు పేలడం, వాటివల్ల తీవ్రంగా గాయపడటం, ఒంటికి నిప్పంటుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.

Delhi Commission for Women: అత్యాచారం పేరుతో మహిళ నాటకం.. ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్.. మహిళపై చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఈ అంశంపై ముందుగానే దృష్టిపెట్టిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఆస్పత్రుల్ని సిద్ధం చేస్తోంది. ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని ఆస్పత్రుల్ని ఆదేశించింది. ముఖ్యంగా బర్న్ వార్డుల్లో బెడ్లు సిద్ధం చేయాలని సూచించింది. దీని ద్వారా కాలిన గాయాలతో ఆస్పత్రికి వచ్చే వారికి త్వరగా వైద్యం చేసే వీలుంటుంది. దీంతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది రెడీగా ఉండాలని, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. యూపీలోని 167 జిల్లా స్థాయి ఆస్పత్రులు, 873 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 3,650 ప్రాథమిక హెల్త్ సెంటర్లు, 20,521 హెల్త్ పోస్టుల్లో చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

Mirzapur: గుడిలో బ్లేడుతో గొంతు కోసుకుని వ్యక్తి మృతి.. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడమే కారణమా?

ప్రతి ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డుల్ని సిద్ధం చేయాలని, కొన్ని బెడ్లకు ప్రత్యేకంగా వీరి కోసం కేటాయించాలని సూచించింది. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం కోరింది. ప్రజలు కూడా దీపావళి సందర్భంగా ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం పొందాలని ప్రజలకు సూచించింది.