బాలికపై అత్యాచారం..ఫోక్సో కోర్టులో విచారణ, 23 రోజుల్లోనే మరణ శిక్ష

Death penalty awarded : నేరం జరిగినప్పుడు..తీర్పు రావడానికి సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో రోజులు..సంవత్సరాలు పడుతుంది. కానీ..ఓ కేసులో కోర్టులో హాజరు పరిచిన 23 రోజుల్లోనే నేరాన్ని నిరూపించి..ఆ వ్యక్తికి మరణ శిక్ష వేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే…ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని కవీనగర్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అంతేగాకుండా..ఆ బాలిక ప్రాణాలను తీశాడు ఆ కామాంధుడు. 2020, అక్టోబర్ 21వ తేదీన ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతురిపై ఎవరో అత్యాచారం జరిపి చంపేశాడంటూ..ఘజియాబాద్ పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే నిందితుడు ఎవరో తేల్చేశారు. బాలిక తండ్రి స్నేహితుడే దారుణ ఘటనకు పాల్పడ్డాడని విచారణలో పోలీసులు నిర్ధారించారు. అనంతరం అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. గత సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన ఛార్జీషీటును పోలీసులు సబ్మిట్ చేశారు. అన్ని పూర్తి చేసి ఫోక్సో కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసును ఫోక్సో కోర్టు సీరియస్ గా పరిగణించింది. నేరం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఫోరెన్సిక్ నివేదికలో తగిన ఆధారాలు దొరికాయి. ఫోక్సో కోర్టులో హాజరు పరిచిన 23 రోజులకు ఫోక్సో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. అతడికి మరణశిక్షను విధిస్తూ..తీర్పును వెలువరించింది. అత్యంత వేగంగా విచారణ జరిగి..తీర్పు రావడం రికార్డులకెక్కింది.

 

ట్రెండింగ్ వార్తలు