Rickshawala IT notice : రిక్షావాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ నోటీసులు

ఓ రిక్షావాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ అయిన బాదితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.

Rickshawala IT notice : రిక్షావాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ నోటీసులు

Rickshaw Puller Approaches Cops After Receiving It Notice (1)

Rickshaw puller approaches cops after receiving IT notice: రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే రూ.100లు కూడా సంపాదించలేని ఓ రిక్షావాలాకు రిక్షావాలాకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసు జారీ చేసిన ఘటన యూపీలోని మధుర జిల్లాలో సంచలనం రేపింది. దీంతో అతను హడలిపోయాడు. షాక్ అయ్యాడు. ఇదేంటీ నా సంపాదన ఎంత? నేను ట్యాక్స్ కట్టటం ఏంటీ? పైగా కోట్ల రూపాయలు కట్టాలని నాకు చెప్పటం ఏంటీ అంటూ భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మధురజిల్లా అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ అనే ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి రిక్షా నడుపుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనికి ఐటీ శాఖ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు వెంటనే రూ.3 కోట్లు ట్యాక్స్ కట్టాలని తెలిపారు. దీంతో ప్రతాప్ సింగ్ కు ఏం చేయాలో తెలియక మధుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దీంట్లో ఏదో మతలబు ఉందని భావించిన పోలీసు అధికారి అనూజ్ కుమార్ సింగ్ కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేపట్టారు. దీంట్లో భాగంగా ప్రతాప్ సింగ్ ను పలు ప్రశ్నలు వేశారు.

ఇటీవల కాలంలో నువ్వేమన్నా ఎక్కడన్నా సంతకాలు పెట్టావా? అని అడిగారు.దానికి ప్రతాప్ సింగ్ మార్చి 15న తేజ్ ప్రకాష్ ఉపాధ్యాయ్ యాజమాన్యంలోని బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని..పాన్ కార్డును సమర్పించాల్సిందిగా తన బ్యాంక్ చెప్పారని దాని కోసం నేను పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. ఆతరువాత కొన్ని రోజులకు నాకు బకాల్ పూర్ చెందిన సంజయ్ సింగ్ నుంచి పాన్ కార్డు కలర్ జిరాక్స్ ఫొటో కాపీ వచ్చిందని..ఆతరువాత నాకు అక్టోబరు 19వతేదీన ఐటీ అధికారుల నుంచి తనకు (మొబైల్ నం. 9897762706) ఫోన్ వచ్చిందని..ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి 3,47,54,896రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాలని పేర్కొన్నారని రిక్షావాలా చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులకు విషయం అర్థం అయ్యింది.

ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరో వ్యాపారి సదరు రిక్షా వాలా ప్రతాప్ సింగ్ పేరుపై జిఎస్‌టి నంబరు పొందారని, 2018-19లో వ్యాపారి టర్నోవర్ రూ.43,44,36,201 అని అధికారులు చెప్పారని సింగ్ చెప్పాడు.

దీనిపై బాధితుడు రిక్షా వాలా ప్రతాప్ సింగ్ ..నేను నిరక్షరాస్యుడినని..ఎవరో తనను మోసగించారని వాపోతు నా కేసు నమోదు చేసుకుని నాకు న్యాయం చేయాడని పోలీసుల్ని కోరాడు. ఇదే విషయాన్ని నేను ఐటీ అధికారులకు తెలిపానని వారు వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయమని అన్నారని వారి సలహా మేరకు నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు రిక్షా వాలా ప్రతాప్ సింగ్.