Goat Milk Demand : లీటరు మేక పాలు రూ.1500..ఓ రేంజ్ లో పెరిగిన ధర..ఎందుకంటే

డిమాండ్ ఉంటే దేనికైనా రాత్రికి రాత్రే ధరలు రెక్కలొచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు మేకపాలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది.ఎంత డిమాండ్ అంటే. లీటరు రూ.50 ఉంటే ధర రూ.1500లు అమ్మేంత..

10TV Telugu News

Full demand for goat milk per liter sells for Rs 1,500 :  మేకపాలకు భలే డిమాండ్ వచ్చేసిందబ్బా.ఎంత డిమాండ్ అంటే..ఉత్తరప్రదేశ్‌లో లీటరు రూ.50లు ఉండే మేక పాలు ఏకంగా రూ.1500లు పెట్టినా దొరకనంత డిమాండ్ వచ్చి పడింది. ఎందుకంత ధర అమ్మటానికి కారణమంటే..‘డెంగ్యూ’ ఫీవర్ వల్లేనట. యూపీలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డెంగ్యూతో ఎన్నో ప్రాణాలు పోయాయి. డెంగ్యూ వస్తే ముఖ్యంగా బ్లడ్ లో ప్లేట్ లెట్స్ స్థాయిలు పడిపోతాయి. దీంతో ప్రాణాలు పోయే ప్రమాదం చాలా ఉంది.

Read more : Goat Milk : మేకపాలతో ఆరోగ్యం…రోజుకొక గ్లాసు చాలంటున్న నిపుణులు

ఈక్రమంలో మేకపాలు తాగితే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని ప్రచారం జరగడంతో.. ఇక మేక పాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డెంగ్యూ వచ్చినవారు మేక పాల కోసం ఎగబడుతుంటే..రాని వారు కూడా ముందు జాగ్రత్తగా జనాలు మేక పాల కోసం ఎగబడుతున్నారు. దీంతో మేకపాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. లీటరు రూ.50లు ఉండే మేకపాల ధర ఒక్కసారిగా రూ.1500లకు పెరిగిపోయింది. అంత రేటు పెట్టిన మేకపాలు దొరకకపోవటం గమనించాల్సిన విషయం మేకపాల కోసం క్యూ కడుతున్నారు. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. డిమాండ్ కు తగినంతగా పాలు లేకపోవటంతో ఉత్తరప్రదేశ్‌లో మేకపాలకు ఓ రేంజ్‌లో ధర పెరిగిపోయింది.

Read more : మేక పాలు తాగి పెరుగుతున్న ఆవుదూడ

ఈ మేక పాల డిమాండ్ గురించి యూపీలోని సదర్ బాదర్ సమీపంలో ఓ పాల వ్యాపారి మాట్లాడుతూ..ఆగస్టు నుంచి యూపీలో డెంగ్యూ వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రజలు మేక పాలు కోసం నన్ను ఒకటే అడుగుతున్నారు. ఫోన్ చేయటం..నేరుగా ఇంటికే వచ్చి అడగటం ఎలాగైనా సరే కనీసం ఒక అరలీటరు అయినా ఇవ్వు అంటూ కోరుతున్నారని తెలిపాడు.

కాగా..ఆవు పాలు, గేదె పాలతో పాటు నేను నేను మేకపాలు కూడా అమ్ముతుంటారు. మేకపాలు లీటర్ రూ .50కి అమ్మేవాడిని కానీ ఈ డెంగ్యూ వచ్చాక డిమాండ్ పెరగింది. అలా అలా ధర రూ .1500 కి పెరిగింది. స్థానికంగా ఉండే ఆయుర్వేద డాక్టర్లు మేకపాల తాగినా దాతో కాఫీలు, టీలు పెట్టుకుని తాగినా ప్లేట్‌లెట్లు పెరుగుతాయని చెప్పడంతో జనాలు ఓ రేంజ్‌లో ఎగబడ్డారు. మేకపాలల్లో కాల్షియం, మాంసకృత్తులు, కార్భోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి..కాని డెంగ్యూ వస్తే మేకపాలు తాగటం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతాయని అనడానికి ఎటువంటి శాస్త్రీయ రుజువు లేదని డాక్టర్లు చెబుతున్నారు.

10TV Telugu News