Rape Attempt : కిరాతకం… రేప్‌కి అడ్డగించిందని.. వేడి కత్తితో…

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. లలిత్ పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళను ఇద్దరు దుండగులు అత్యాచారం చెయ్యబోయారు. అయితే ఆమె వారిని అడ్డుకుంది. వారితో ఘర్షణ పడింది. అంతేకాదు వారిద్దరిని చెప్పుతో కొట్టింది. దీన్ని అవమానంగా భావించిన దుండగులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. సిగరెట్ లైటర్ తో కత్తిని వేడి చేసి

10TV Telugu News

Rape Attempt : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. లలిత్ పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళను ఇద్దరు దుండగులు అత్యాచారం చెయ్యబోయారు. అయితే ఆమె వారిని అడ్డుకుంది. వారితో ఘర్షణ పడింది. అంతేకాదు వారిద్దరిని చెప్పుతో కొట్టింది. దీన్ని అవమానంగా భావించిన దుండగులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. సిగరెట్ లైటర్ తో కత్తిని వేడి చేసి ఆమె రెండు కళ్లలో పొడిచారు.

జూలై 21న ధమ్నా గ్రామంలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సాయంత్రం చీకటి పడే సమయంలో దుకాణం మూసేసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

తాను ఇంటికెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వెనకాలే వచ్చి తనను పట్టుకోబోయారని బాధితురాలు తెలిపింది. వెంటనే తాను అప్రమత్తం అయ్యానని, చెప్పుతో ఇద్దర్నీ చితకబాదేందుకు ప్రయత్నించానని చెప్పింది. ఆమెతో చెప్పు దెబ్బలు తిన్న ఆ ఇద్దరూ…. ఘోర అవమానంగా ఫీలయ్యారు. మమ్మల్నే చెప్పుతో కొడతావా అంటూ ఇద్దరూ ఆమెను బలంగా పట్టుకున్నారు. సిగరెట్ లైటర్‌తో కత్తిని వేడి చేసి… ఆమె రెండు కళ్లలో పొడిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. ఆ తర్వాతి రోజు ఉదయం స్థానికులు ఆమెను చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

నిందితులు స్థానికంగా ఉండేవారేనని పోలీసులు తెలిపారు. తరచూ నేరాలు చేస్తూ ఉంటారని చెప్పారు. 3 నెలల క్రితం కూడా వాళ్లు తనను రేప్ చెయ్యాలని చూశారని, లైంగికంగా వేధించారని బాధితురాలు వాపోయింది. దీనిపై పోలీసులు స్పందించారు. గతంలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు… ఆ ఇద్దరూ… బూతులు తిట్టారని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చిందని, అందువల్ల అంత సీరియస్‌గా తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఇద్దరిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వివరించారు.

10TV Telugu News