Cow : ఆవుల కోసం అంబులెన్స్ ..ఏ రాష్ట్రంలో తెలుసా ?

దేశంలోనే తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసును ప్రారంభించనున్నారు.

Cow : ఆవుల కోసం అంబులెన్స్ ..ఏ రాష్ట్రంలో తెలుసా ?

Cow

UP To Start Cow Ambulance : దేశంలోనే తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసును ప్రారంభించనున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆవుల కోసం అంబులెన్స్ సేవను ప్రారంభించనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 112 ఎమర్జెన్సీ సర్వీస్ నంబరుతో  సేవలను అందించనుంది.

Read More : Post-Mortem : ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం.. కేంద్రం కీలక నిర్ణయం

మనుషులతో సమానంగా ఈ కొత్త అంబులెన్స్ సేవలు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ఆవులకు చికిత్స చేయడానికి మార్గం సుగమం కానుందని యూపీ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధశాఖ పేర్కొంది.  ఈ పథకం కింద 515 అంబులెన్స్ లు లు సిద్ధంగా ఉంచారు. అనారోగ్యం బారిన పడిన ఆవుల చికిత్స కోసం ఫోన్ చేసిన 15, 20 నిమిషాల్లోనే వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్ వస్తుంది. వెంటనే చికిత్స అందిస్తారు.

Read More : T20 World Cup 2021: ఆస్ట్రేలియన్లు బూట్లలో ఆల్కహాల్ పోసుకుని తాగడానికి కారణం..

అవసరమైతే అనారోగ్యానికి గురైన ఆవును పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఈ పథకం కింద ఫిర్యాదుల స్వీకరణ కోసం లక్నోలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఉచితంగా నాణ్యమైన వీర్యం అందిండం ద్వారా యూపీలో ఆవుల జాతి అభివృద్ధి చేయనున్నారు.  మథుర సహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ ఆవుల అంబులెన్స్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.