అద్భుతం : పంటపొలాన్ని ఐల్యాండ్ గా మార్చేసిన మహిళ..గూగుల్ ప్రశంసలు

  • Published By: nagamani ,Published On : November 25, 2020 / 04:04 PM IST
అద్భుతం : పంటపొలాన్ని ఐల్యాండ్ గా మార్చేసిన మహిళ..గూగుల్ ప్రశంసలు

UP woman kiran kumari make island : మహిళలు తలచుకుంటే అద్భుతాలను సృష్టించగలరనీ..వారి వినూత్న ఆలోచనలను అంచనా వేయటం మేధావుల తరం కూడా కాదని మరోసారి రుజువైంది. ఓ మహిళకు వచ్చిన అందమైన..అద్భుతమైన ఆలోచనతో పంటపొలం కాస్తా అద్భుతమైన ‘ఐల్యాండ్’గా మారిపోయింది.



ఆ ఐల్యాండ్ అందమైనదే కాదు చక్కటి ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతోంది. పంటపొలంగా ఉన్నప్పటికంటే ఎక్కువ ఆదాయాన్నిస్తోంది. అంతేకాదు ఆమె సృష్టించిన ఆ అద్భుతాన్ని చూసేందుకు టూరిస్టులు తరలివస్తున్నారు. దీంతో పేరుకు పేరు ఆదాయానికి ఆదాయం అన్నట్లుగా విలసిల్లుతోంది ఆ ఐల్యాండ్. ఆ ఐల్యాండ్ ను గూగుల్ కూడా గుర్తించింది. ప్రసంశలతో పాటు అరుదైన అవార్డును కూడా అందించింది.




https://10tv.in/scotland-becomes-worlds-first-country-to-make-sanitary-pads-tampons-free-for-all/

వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్‌ పరిధిలోని బథువా గ్రామానికి చెందిన కిరణ్ కుమారీ రాజపూత్‌ అనే మహిళ అద్భుతమైన ఐల్యాండ్‌ను సృష్టించారు. ఎవరూ ఊహించని విధంగా పంట పొలంగాఉండే భూమిని ఐల్యాండ్ గా తీర్చిదిద్దారు. తన పొలానికి నీటి వసతి లేకపోయినప్పటికీ ఆమె తన అద్భుత కలను సాకారం చేసుకున్నారు. ఆ చెరువులో కిరణ్ కుమారి తన ముద్దుల మనుమడితో కలిసి బోట్ షికార్ చేస్తుంటారు.



ఈ దీవిలో సాక్షాత్తూ ప్రకృతి మాతే కొలువైనట్లుగా తీర్చిదిద్దారామె. ప్రకృతి అందాలను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఔరా..ఏమీ ఈమె ప్రతిభ అంటున్నారు. ఈ ఐల్యాండ్‌ను గుర్తించిన గూగుల్ దీనిని తీర్చిదిద్దిన కిరణ్ కుమారీ రాజ్ పుత్ కు ప్రశంసలతో కూడిన సర్టిఫికెట్ అందజేసింది.


కిరణ్ కుమారీ రాజపూత్‌కు గుంద్హాలో 120 చదరపు అడుగుల పంట భూమి ఉంది. ప్రభుత్వ పథకం కింద రెండు లక్షల రూపాయలు అప్పుతీసుకుని..ఇంకొంత బైట అప్పు తీసుకుని అలా మొత్తం మొత్తం 11 లక్షల రూపాయల ఖర్చుతో ఆ భూమిలోని ఎక్కువ నేలను పెద్ద చెరువుగా మార్చారు. కొంతభాగం పంటభూమి మధ్యలో దిబ్బగా (ఐల్యాండ్) ఉంచేశారు. చెరువులా తయారు చేసిన ప్రాంతంలో చేపల పెంపకాన్ని ప్రారంభించారు.



కిరణ్ కుమారీ కొడుకు శైలేంద్ర సహాయంతో చేపల వ్యాపారాన్ని డెవలప్ చేశారు. చేపలు తిరగటానికి కావాల్సినంత ప్లేస్ ఉండటంతో చేపలు చక్కగా పెరిగాయి. అలాగే ఆ చెరువు మధ్యలో దిబ్బలాగా ఉంచిన ప్రాంతంలో మొక్కలు నాటించి..దానిని ఐల్యాండ్‌గా మార్చారు.




ఆ ఐల్యాండ్‌లో మామిడి, అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ, నారింజ, ఉసిరి వంటి ఎన్నో పండ్ల మొక్కలతో పాటు అందమైన పూల మొక్కలను పెంచుతున్నారు. ఇప్పుడు ఆ పండ్ల మొక్కలు పెరిగి ఐల్యాండ్‌కు మరింత అందాన్నిచ్చాయి. దీంతో ఈ ప్రాంతం అందమైన పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. పూల మొక్కల అందం చూస్తే కళ్లు తిప్పుకోలేం. అలాగే ఐల్యాండ్ లో కోళ్లు బాతులు,కుందేళ్లు వంటివి పెంచుతున్నారు.



ఈ పంటభూమి ఐల్యాండ్ అందాలగురించి తెలుసుకుని ఆ సమీపప్రాంతాల్లోని ప్రజలు ఆహ్లాదం కోసం ఇక్కడికి వస్తుంటారు. పంట భూమిని ఇలా ఐల్యాండ్ లాగా మార్చాలనే కిరణ్ కుమారీ ఆలోచనని ప్రశంసిస్తున్నారు.



కాగా చేపలు, పండ్ల విక్రయాలతో ఏటా రూ. 25 లక్షల వరకూ ఆదాయాన్ని పొందుతున్నారు కిరణ్ కుమారీ కుటుంబం. ఇంత గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాన్ని ఐల్యాండ్ గా మార్చిన చక్కటి ఆదాయాన్ని పొందుతున్న కిరణ్ కుమారీ రాజ్ పుత్ క10వ తరగతి చదివారంటే నమ్మగలమా? అదీ ఓ మహిళకుండే సత్తా అని మాత్రం ఒప్పుకోక తప్పదు.



సమస్య ఉందని బాధపడకుండా దాన్నే ఆయుధంగా చేసుకుని ఇలా ఐల్యాండ్ ను తయారు చేసి సమస్య సాయుధంగా మార్చుకుని చక్కటి ఆదాయంతో పాటు పేరు ప్రఖ్యాతుల్ని గడించారు కిరణ్ కుమారీ రాజ్ పుత్.