UP Youth Manifesto : కొత్త యూపీ సృష్టిస్తాం.. యువతే మా బలం.. కాంగ్రెస్ యూపీ యూత్ మేనిఫెస్టో విడుదల

కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ యువత మేనిఫెస్టోను విడుదల చేశారు.

UP Youth Manifesto : కొత్త యూపీ సృష్టిస్తాం.. యువతే మా బలం.. కాంగ్రెస్ యూపీ యూత్ మేనిఫెస్టో విడుదల

Up Youth Manifesto Congress Promises 20 Lakh Jobs, Filling Of 1.5 Lakh Teacher Posts In Up Youth Manifesto

UP Youth Manifesto : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ యువత మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా విడుదల చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ యువత మేనిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న పార్టీ యూపీలోని మహిళలకు 40 శాతం టిక్కెట్లను రిజర్వ్ చేస్తానని ప్రకటించింది. యూపీ యూత్ మ్యానిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు, 1.5 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల యువజన మ్యానిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు, 1.5 లక్షల ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలు యూపీ వ్యాప్తంగా యువతతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. యువత ఇచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగానే కాంగ్రెస్ యువత మేనిఫెస్టో రూపొందించినట్టు చెప్పారు. యువత మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ కూడా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల క్యాలెండర్‌లో రిక్రూట్‌మెంట్, అడ్వర్టైజ్‌మెంట్, పరీక్ష, అపాయింట్‌మెంట్ తేదీలను నమోదు చేస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిజర్వేషన్ సంబంధిత స్కామ్‌ను నిరోధించేందుకు ప్రతి రిక్రూట్‌మెంట్‌కు సామాజిక న్యాయ పర్యవేక్షకులు ఉంటారని ప్రియాంక స్పష్టం చేశారు.

మేం విద్వేషాన్ని వ్యాప్తి చేయం.. ప్రజలను ఏకం చేశాం : రాహుల్
మేం విద్వేషాన్ని వ్యాప్తి చేయడం లేదని, ప్రజలను ఏకం చేశామని కాంగ్రెస్‌ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ ద్వేషాన్ని వ్యాపింపజేయదని, యువత బలంతో కొత్త యూపీని సృష్టించాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని యువతకు కొత్త దార్శనికత అవసరమని, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రానికి ఆ విజన్ ఇవ్వగలదని ఆయన అన్నారు. యూపీలో 16 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్ గాంధీ చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ యూత్ మ్యానిఫెస్టోను విడుదల చేశామని, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. యువత సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి గంటకు 880 మంది యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని, 16 లక్షల మంది యువత ఉపాధి కోల్పోయారని ఆయన చెప్పారు. కొత్త యూపీని సృష్టించాలనుకుంటున్నామని, యువత మా బలం అన్నారు. ఇదిలా ఉండగా, ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఫిబ్రవరి 10 నుండి ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూపై అమృత్‌సర్ నుంచి బిక్రమ్ సింగ్ మజిథియాను పోటీకి దింపాలని శిరోమణి అకాలీదళ్ ఆసక్తిగా ఉంది. బీజేపీ కూడా సిద్ధూపై పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. యూపీ ఎన్నికల్లో యాదవ్ కుటుంబానికి కంచుకోట అయిన మెయిన్‌పురిలోని కర్హాల్ స్థానం నుంచి సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. 2002 , 2007 మధ్య ఐదు ఏళ్లు మినహా 1993 నుండి ప్రతి ఎన్నికలలో కర్హాల్ స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ గెలుస్తోంది.

ఈ స్థానం సమాజ్ వాదీకి కంచుకోట గానే చెప్పవచ్చు. వచ్చే నెలలో జరగనున్న గోవా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాలో మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు చోటు దక్కలేదు. పనాజీ సీటు కావాలని కోరిన ఆయన కుమారుడిని కాదని, అటానాసియో ‘బాబుష్’ మాన్‌సెరేట్‌కు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై గోరఖ్‌పూర్‌లో పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

Read Also : AP Cabinet : ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం..రిటైర్‌‌మెంట్ 62 ఏళ్లకు పెంపు