WhatsApp: యూపీఐ పిన్‌ను వాట్సప్‌తో మార్చుకోండిలా..

యూజర్లకు రొటీన్ నుంచి భిన్నంగా తీసుకెళ్లేందుకు కొత్త ఫీచర్లతో ఊరిస్తుంది WhatsApp. మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సప్.. మనీ ట్రాన్సఫర్ చేసేందుకు కూడా ఫీచర్ తెచ్చింది.

WhatsApp: యూపీఐ పిన్‌ను వాట్సప్‌తో మార్చుకోండిలా..

Whatsapp

WhatsApp: యూజర్లకు రొటీన్ నుంచి భిన్నంగా తీసుకెళ్లేందుకు కొత్త ఫీచర్లతో ఊరిస్తుంది WhatsApp. మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సప్.. మనీ ట్రాన్సఫర్ చేసేందుకు కూడా ఫీచర్ తెచ్చింది. ఇప్పుడు అందులో కొత్త ఫీచర్లు యాడ్ చేస్తుంది యూపీఐ పిన్ మార్చుకునే వెసలుబాటు కూడా కల్పిస్తుంది.

2020లో లాంచ్ చేసిన ఈ ఫీచర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) నుంచి అప్రూవల్ దక్కించుకుంది. మొత్తం 227 బ్యాంకులతో అనుసంధానమైన రియల్ టైం పేమెంట్ సిస్టమ్ ను నడిపిస్తుంది. మరి యూపీఐ మార్చుకోవాలంటే మనమేం చేయాలి.

* మీ Android ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి.
* కుడివైపు పైభాగంలోని ఆప్షన్లపై నొక్కి, పేమెంట్స్‌పై నొక్కండి.
* పేమెంట్ సెక్షన్స్ కింద, మీరు UPI పిన్ నంబర్‌ను మార్చాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్ సెలక్ట్ చేసుకోండి.
* ఆపై UPI పిన్ చేంజ్ ఆప్షన్‌పై నొక్కండి.
* ఇప్పటికే ఉన్న UPI పిన్‌ని నమోదు చేసి, ఆపై కొత్త UPI పిన్‌ని నమోదు చేయండి.
* కొత్త UPI పిన్ నంబర్‌ని నిర్ధారించాలి.

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ ఫేసర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన ఎంఎస్ ధోనీ

యూపీఐ పిన్ మర్చిపోతే..
* Forgot UPI పిన్‌పై నొక్కండి.
* CONTINUE ఎంచుకుని, మీ డెబిట్ కార్డ్ నంబర్ యొక్క చివరి 6-అంకెలు మరియు చివరి తేదీని నమోదు చేయండి (కొన్ని బ్యాంకులు మీ CVV నంబర్‌ను కూడా అడగవచ్చు).
* దీని తర్వాత మీరు మీ UPI పిన్‌ని రీసెట్ చేసుకోవచ్చు.