MP : అగ్రవర్ణాల మహిళలను బయటకు లాక్కొచ్చి పనులు చేయించాలి : మంత్రి వివాదాస్ప వ్యాఖ్యలపై దుమారం

అగ్రవర్ణాల మహిళలను బయటకు లాక్కొచ్చి వారితో కూడా పనులు చేయించాలని అదే సమానత్వం అని మంత్రి చేసిన వివాదాస్ప వ్యాఖ్యలపై దుమారం రేగింది.

MP : అగ్రవర్ణాల మహిళలను బయటకు లాక్కొచ్చి పనులు చేయించాలి : మంత్రి వివాదాస్ప వ్యాఖ్యలపై దుమారం

Mp Minister Bisahulal Singh

MP minister apologises for upper caste women remark : కొన్ని సార్లు మనం చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాతాయి. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు చేసే వ్యక్తి, వారి స్థాయి..చేసిన సందర్భం ఇలా కొన్ని అంశాలు దుమారం రేపుతాయి. అగ్రవర్ణ కుటుంబంలో మహిళలపై ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తీవ్ర దుమారం రేపాయి.దీంతో సదరు మంత్రిగా క్షమాపణ చెప్పారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..అగ్రవర్ణ కుటుంబాల్లోని మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారని వారిని కూడా బయటకు తీసుకొచ్చి (లాక్కువచ్చి)పనిచేసేలా చేయాలని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగటంతో మంత్రి బిసాహులాల్ క్షమాపణ చెప్పారు.

Read more : బీజేపీ నేత వ్యాఖ్యలు : ఫ్లూట్ ఊదితే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయ్

అగ్రవర్ణ కుటుంబాల్లో (ఠాకూర్ కుటుంబాల్లో) మహిళల్ని ఇంటికే పరిమితం చేయడం సరికాదని..వారు కూడా బయటకు వచ్చి పురుషులతో కలిసి పనిచేయాలని మంత్రి వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం అనుప్పుర్ జిల్లాలో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత మాట్లాడుతూ.. ఠాకూర్, థాకరే వంటి అగ్రకులాల్లోని మహిళలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారని..వారిని బయట పనులకు పంపరని అన్నారు. కానీ కిందిస్థాయి కుటుంబాల్లోని మహిళలు మాత్రం ఇళ్లలోను, పొల్లాలోనూ పనిచేస్తున్నారని అన్నారు.

సమాజంలో స్త్రీపురుషులు సమానమే అయినప్పుడు మహిళలు కూడా తమ బలాన్ని గుర్తించి పురుషులతో కలిసి పనిచేయాలని అన్నారు. కాబట్టి అగ్రవర్ణాల మహిళలను బయటకు లాగి సమానత్వాన్ని తీసుకురావాలని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Read more : బీజేపీ నేత వ్యాఖ్యలు : ఆవు మాంసమే కాదు కుక్కను కూడా తినండి

మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో దిగొచ్చిన మంత్రి బిసాహులాల్ క్షమాపణలు చెప్పారు. ‘నేను దురుద్ధేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే దయచేసి క్షమించాలని ఆయన కోరారు.తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని..తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. మహిళలు సామాజిక సేవ చేయాలని మాత్రమే తాను అన్నానని..తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.

మంత్రి బిసాహులాల్ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. 2020 అక్టోబర్ లో తన ప్రత్యర్థి అయినా కాంగ్రెస్ అభ్యర్థి భార్యపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ అభ్యర్థి విశ్వనాథ్ సింగ్ రెండో భార్య రాజ్‌వతి సింగ్‌ను రఖైల్ ఔరత్ (ఉంపుడుగత్తె) అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై IPC సెక్షన్లు 294 మరియు 506 కింద కేసు నమోదు చేశారు.