అయోధ్య రాముడికి భారీ గంట

  • Published By: madhu ,Published On : August 10, 2020 / 07:09 AM IST
అయోధ్య రాముడికి భారీ గంట

అయోధ్యలో రామాలయం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆలస్యం..భారీగా విరాళాలు వచ్చి పడుతున్నాయ. తమకు తోచిన విధంగా ఆలయానికి విరాళం ఇస్తున్నారు. కొంతమంది డబ్బుల రూపంలో ఇస్తుంటే..మరొకరు ఇతర రూపాల్లో సహాయం చేస్తున్నారు. తాజాగా ఓ హిందూ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది.



ఆలయానికి ఓ భారీ గంటను తయారు చేస్తోంది. ఇంత భారీ గంట ఎక్కడా లేదని అంటోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జలేసర్ లో దావూ దయాల్ హిందూ కుటుంబం నివాసం ఉంటోంది. అయోధ్య రాముడి ఆలయానికి భారీ గంటను తయారు చేయాలని భావించారు. వెంటనే పనులు మొదలు పెట్టారు. సుమారు 2.1 టన్నుల భారీ గంటను తయారు చేయిస్తున్నారు.



తయారు చేస్తున్న కార్మికుల్లో ముస్లింలు కూడా ఉన్నారు. పసిడి, వెండి, రాగి, జింక్, సీసం, టిన్, ఇనుము, పాదరసం వినియోగిస్తున్నారు. ఇందులో ఎలాంటి అతుకులు ఉండవని, దీని తయారీకి రూ. 21 లక్షలు ఖర్చు అవుతున్నాయని, 25 మంది నిపుణులు పని చేస్తున్నారని దయాల్ తెలిపారు.



ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రతిష్టించేందుకు తాము వెయ్యి కిలోల బరువున్న గంటను తయారు చేయించడం జరిగిందన్నారు.