UPSC..నేషనల్ ఢిఫెన్స్,నావల్ అకాడమీ ఎగ్జామ్ కి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు

మహిళలు ఎన్​డీఏ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఈ ఏడాది నుంచే అనుమతించి తీరాలని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశాలపై

UPSC..నేషనల్ ఢిఫెన్స్,నావల్ అకాడమీ ఎగ్జామ్ కి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు

Woman (2)

UPSC. మహిళలు ఎన్​డీఏ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఈ ఏడాది నుంచే అనుమతించి తీరాలని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశాలపై ఇవాళ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) కీలక ప్రకటన చేసింది. జాతీయ డిఫెన్స్​ అకాడమీ, నావల్ అకాడమీలో ప్రవేశాల కోసం కేవలం అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు శుక్రవారం యూపీఎస్సీ  ఓ ప్రకటన విడుదల చేసింది.

రక్షణ శాఖ అందించే ఫిజికల్ స్టాండర్డ్స్​, ఖాళీల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని యూపీఎస్సీ తెలిపింది. సెప్టెంబర్​ 24 నుంచి అక్టోబర్​ 8 వరకు upsconline.nic.in వెబ్​సైట్​లో మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నవంబర్-14న యూపీఎస్సీ ఎన్డీయే ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్షకు మహిళలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని యూపీఎస్సీ తెలిపింది.

కాగా,వ‌చ్చే ఏడాది నుంచి నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ(NDA) ప‌రీక్ష‌ల్లోమహిళలను అనుమతిస్తామని కేంద్రం దాఖలు చేసిన పిటిష‌న్‌ ను బుధవారం(సెప్టెంబర్-22,2021)సుప్రీంకోర్టు తిర‌స్క‌రించిన విషయం తెలిసిందే. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. డిఫెన్స్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన స్టడీ గ్రూప్.. పరీక్షను వాయిదా వేయాలని సూచించిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఫిట్​నెస్ ట్రైనింగ్, పాఠ్యాంశాలు తదితర అంశాలను ఈ స్టడీ గ్రూప్ పరిశీలిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళలకు వచ్చే ఏడాది నుంచి అవకాశం కల్పిస్తామని తెలిపారు. 2022 మే నెలలో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అందుకు అనుమతించాలని కోరారు. అయితే, ఈ విన్నపాన్ని ధర్మాసనం తిరస్కరించింది. మహిళలు వారి హక్కులను కోల్పోకూడదని తాము కోరుకుంటున్నట్లు జస్టిస్ ఎస్ కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

READ UP Election 2022 : అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు ప్రకటించిన బీజేపీ

ఈ ఏడాది నవంబర్ లో జ‌రిగే ఎన్డీఏ ప‌రీక్ష‌ల నుంచే మ‌హిళ‌ల‌కు అనుమ‌తి క‌ల్పించాల‌ని కోర్టు సృష్టం చేసింది. ఈ ఏడాది న‌వంబ‌ర్ 14వ తేదీన రిలీజయ్యే నోటిఫికేష‌న్‌లోనే మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని యూపీఎస్సీని సుప్రీం ఆదేశించింది. ఒక‌వేళ మే 2022లో మ‌హిళ‌లు ప‌రీక్ష‌లు రాస్తే అప్పుడు వాళ్ల రిక్రూట్మెంట్ 2023 జూన్‌లో జ‌రుగుతుంద‌ని..ఇలాంటి చ‌ర్య‌ల‌తో జాప్యం చేయ‌లేమ‌ని, అమ్మాయిల‌కు ఆశలు నింపామ‌ని..ఇప్పుడు ఆ ఆశ‌ల్ని వ‌మ్ముచేయ‌లేమ‌ని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కాగా, గత నెలలో..నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో మహిళలో ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్డీయే పరీక్షలకు మహిళలకు అనుమతించాలని కోరుతూ కుష్ కర్లా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మహిళలను ఎన్డీయే పరీక్షకు అనుమతించకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 19ని ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకొని సాయుధ బలగాల్లో చేరి.. దేశానికి సేవ చేయాలని ఎంతో మంది అర్హత కలిగిన, ఔత్సాహిక మహిళలు భావిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు. కానీ లింగ వివక్షతో వారి హక్కులను కాల రాస్తున్నారని పిటిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులను కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఎన్డీయే పరీక్షకు మహిళలను కూడా అనుమతించాని స్పష్టం చేసింది. మహిళలను ఎన్డీయేలో అనుమతించాలని, ఎంపిక అయిన వారికి పురుషులతో పాటు శిక్షణ ఇవ్వాలని.. లింగ వివక్ష సరికాదని జస్టిస్ సంజయ్ కిషన్, రిషికేశ్ రాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ గత నెల 18న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

READ Airbus : 56 విమానాల కొనుగోలు కోసం..ఎయిర్‌బస్ తో కేంద్రం మెగా డీల్