UPSC : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్

అభ్యర్ధుల ఎంపిక విధానం విషయానికి వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.100ను నిర్ణయించారు.

UPSC : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్

Upsc (1)

UPSC : నిరుద్యోగులు ఇది శుభవార్తే…ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారికోసం సివిల్ సర్వీసెస్ 2022, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్2022 ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ విభాగంలో మొత్తం 861 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ విభాగంలో 151 ఖాళీలు ఉన్నాయి.

ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. డిగ్రి ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. వయో పరిమితి విషయానికి వస్తే ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్థుల వయస్సు 21-31 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 2, 1990-ఆగస్టు 1 2021 మధ్యలో జన్మించి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విధానం విషయానికి వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.100ను నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 22, 2022 ఆఖరి తేదీగా నిర్ణయించారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జూన్ 5న నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://upsc.gov.in/లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.