US Visas : రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు

భారత్ లోని యూనెటైడ్ స్టేట్స్ మిషన్ 2021లో రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు అప్రూవ్ చేసింది. ఈ మేరకు దేశ ఎంబసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎంబసీ ప్రకారం ఈ ఏడాది 55వేల

US Visas : రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు

Us Visas

US Visas : భారత్ లోని యునెటైడ్ స్టేట్స్ మిషన్ 2021లో రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు అప్రూవ్ చేసింది. ఈ మేరకు దేశ ఎంబసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎంబసీ ప్రకారం ఈ ఏడాది 55వేల మంది విద్యార్థులు, ఎక్స్ చేంజ్ విజిటర్లు అమెరికాలో చదువుకోవడానికి వెళ్లనున్నారు. ప్రతి రోజూ ఇంకా అనేక మంది విద్యార్థుల వీసాలు అప్రూవ్ చేస్తున్నారు.

” అమెరికా మిషన్ రాబోయే కొన్ని నెలల్లో సెమిస్టర్ విద్యార్థుల చదువును సులభతరం చేస్తున్నందున మరొక గొప్ప విద్యార్థి సీజన్ కోసం ఎదురుచూస్తోంది” అని రాయబార కార్యాలయం తెలిపింది.

విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రక్రియ గురించి రాయబారి అతుల్ కేశప్  మాట్లాడారు. కోవిడ్ -19 మహమ్మారి అనేక సవాళ్లను విసిరిందని చెప్పారు. “యునైటెడ్ స్టేట్స్‌లో అధ్యయనం చేయడం భారతీయ విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన, జీవితాన్ని మార్చే అనుభవం. ప్రపంచ దృక్పథాలను తెలుపుతుంది. అమూల్యమైన కెరీర్ అవకాశాలకు దారితీస్తుంది” అని ఆయన అన్నారు.

భారతీయ విద్యార్థులు యుఎస్ సమాజాన్ని సుసంపన్నం చేస్తారు. ఉన్నత స్థాయి విద్యా విజయాన్ని సాధిస్తారు. ఇరు దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత మెరుపరుస్తారు” అని కేశప్ తెలిపారు. సాధారణంగా మే నెలలో సెమిస్టర్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. అయితే కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైందన్నారు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా యుఎస్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు తగిన సామర్థ్యంతో పనిచేయకపోవడం వల్ల వీసా ప్రాసెసింగ్ ఆలస్యమైంది. విదేశాల్లో ఉన్న కొంతమంది విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభానికి చేరుకోలేకపోయారు.

యునైటెడ్ స్టేట్స్‌లో కొత్త అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 2020లో 43% పడిపోయింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (IIE) సర్వే ప్రకారం, క్యాంపస్‌లో వ్యక్తిగతంగా ప్రవేశించిన కొత్త విద్యార్థుల సంఖ్య 72% తగ్గింది.