Blood Sugar: షుగర్ టెస్ట్ కోసం సూది గుచ్చనక్కర్లే.. చెమటను పరీక్షిస్తే చాలు

సూది గుచ్చకుండానే రక్తంలో షుగర్ లెవల్స్ ని గుర్తంచే పరికరాన్ని రూపొందించారు పరిశోధకులు. చెమటను పరీక్షిస్తే చాలు..బ్లడ్ లో షుగర్‌ లెవల్స్‌ గుర్తించే పరికరాన్ని తయారు చేశారు.

Blood Sugar: షుగర్ టెస్ట్ కోసం సూది గుచ్చనక్కర్లే.. చెమటను పరీక్షిస్తే చాలు

Blood Sugar Levels (1)

Blood Sugar Levels: డయాబెటిస్‌. సైలెంట్ కిల్లర్ గా ప్రాణాల్ని హరించేస్తున్న వ్యాధి. డయాబెటిస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగుతోంది. డయాబెటిస్‌ బారిన పడిన ఆహారం విషయంలో చాలా నియమాలు పాటించాలి. షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాన్ని అస్సలు తినకూడదు. అలాగే క్రమం తప్పకుండా డయాబెటిస్ పరీక్షలుచేయించుకోవాలి. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను బట్టి ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

అలా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తెలుసుకోవాలి అంటే సూది గుచ్చాల్సిందే. బ్లడ్ తీయాల్సిందే. పరీక్షలుచేయించాల్సి. కానీ రక్తం తీయాలంటే సూది గుచ్చడం ఇబ్బంది అనే చెప్పాలి. ముఖ్యంగా వృద్ధులకు. కానీ ఇకనుంచి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తెలుసుకునే పరీక్ష చేయించుకోవాలంటే సూది గుచ్చనక్కర్లేదు. జస్ట్ ‘చెమట’ను పరీక్ష చేసి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెప్పొచ్చు అంటున్నారు అమెరికా పరిశోధకులు.

Read more :  Diabetes :షుగర్ వ్యాధి దరి చేరకుండా ఉండాలంటే?..

దీని కోసం ఓ కొత్త డివైజ్‌ ను రూపొందించారు. ఈ డివైజ్ తో రక్తం తీయాల్సిన అవసరమే ఉండదు. కేవలం మన శరీరంపై వచ్చే చెమట ఆధారంగా రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించవచ్చంటున్నారు పరిశోధకులు. ఈ పరికరాన్ని చేతిపై ధరిస్తే..శరీరంపై ఉండే చెమట ద్వారా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను గుర్తించవచ్చు అంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు. దీనికి సంబంధించిన వివరాలను ‘బయోసెన్సర్స్’ బయోఎలక్ట్రానిక్స్’ జర్నల్‌లో ప్రచురించారు.

ఈ డివైజ్‌లో నికెల్‌ మెటల్‌ను ఉపయోగించారు. బంగారాన్ని కూడా వినియోగించారు. దీని కారణంగా ఎవరికైనా అలెర్జీ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అంటున్నారు పరిశోధకులు. ఈ డివైజ్‌ రక్తంతో పోలిస్తే చెమటలోని గ్లూకోజ్‌ 100 రెట్లు ఎక్కువగా గుర్తించడంలో పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పరికరాలు నిర్దిష్ట ఎంజైమ్‌లతో ఆల్కలీన్ ద్రవాలను ఉపయోగించడం వలన చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని..కానీ ఈ డివైజ్‌లో ఎటువంటి ఎంజైమ్‌లు ఉపయోగించలేదని కాబట్టి చర్మానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

Read more : Diabetes : శరీరంలో షుగర్ వ్యాధి లక్షణాలను గుర్తించటమెలాగంటే!..

మరి ఈ డివైజ్ అందరికి అందుబాటులోకి వస్తే..ఇక సూది గుచ్చకుండానే రక్తం తీయకుండానే రక్తంలో షుగర్ లెవెల్స్ ను తెలుసుకోవచ్చు. టెక్నాలజీ డెవలప్ మెంట్ లో ఇదికూడా భాగం కావటంతో ఈ డివైజ్ అందుబాటులోకి వస్తే ఇక షుగర్ టెస్ట్ లు మరింత సులభం అవుతాయన్నమాట.