Antony Blinken : భారత పర్యటనకు అమెరికా విదేశాంగ మంత్రి

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్‌ రెండు రోజుల భారత పర్యటనకు రానున్నారు.

Antony Blinken : భారత పర్యటనకు అమెరికా విదేశాంగ మంత్రి

Blinken

Antony Blinken అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్‌ రెండు రోజుల భారత పర్యటనకు రానున్నారు. మంగళవారం(జులై-27,2021)నుంచి బ్లింకన్.. రెండు రోజుల భారత పర్యటన ప్రారంభమవుతుంది. జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానుండటం ఇదే మొదటిసారి.

ఈ పర్యటనలో ఆంటోని బ్లింకెన్​.. ప్రధాని నరేంద్రమోదీతోపాటు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ కానున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారతదేశంలో మానవ హక్కులు, పెగసాస్ గూఢచర్యం,కరోనా నివారణ చర్యలు, ఇండో- పసిఫిక్‌ ప్రాంతీయ అంశాలు, అఫ్ఘానిస్థాన్‌లో తాజా పరిస్థితి,ఉగ్రవాద నిధుల విషయంలో పాకిస్తాపై ఒత్తిడి కొనసాగించాల్సిన అవసరం వంటి విషయాలను బ్లింకెన్‌ తన భారత పర్యటనలో లేవనెత్తే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బ్లింకెన్ పర్యటన.. ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సంభాషణను కొనసాగించడానికి మరియు భారత్-యూఎస్ ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడానికి ఒక అవకాశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుపక్షాలు బలమైన మరియు బహుముఖ భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షిస్తాయి మరియు వాటిని మరింత సంఘటితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. US Secretary Of State Blinken Arrives In India On Tuesday