Used PPE Kits : మనుషులేనా..? వాడేసిన పీపీఈ కిట్లను ఉతికి మళ్లీ అమ్మకం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

కరోనా సంక్షోభం వేళ డబ్బుల కోసం కొందరు నీచానికి ఒడిగడుతున్నారు. డబ్బు మోజులో మరీ దిగజారిపోతున్నారు. ఏకంగా సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవడు ఎలా పోతే మనకెందుకు.. మనకు డబ్బులు వస్తున్నాయి అది చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఎంతటి నీచానికి దిగజారారంటే.. వాడి పడేసిన పీపీఈ కిట్లు, గ్లౌజులను ఉతికి మళ్లీ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Used PPE Kits : మనుషులేనా..? వాడేసిన పీపీఈ కిట్లను ఉతికి మళ్లీ అమ్మకం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Used Ppe Kits For Resale

Used PPE Kits For Resale : కరోనా సంక్షోభం వేళ డబ్బుల కోసం కొందరు నీచానికి ఒడిగడుతున్నారు. డబ్బు మోజులో మరీ దిగజారిపోతున్నారు. ఏకంగా సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవడు ఎలా పోతే మనకెందుకు.. మనకు డబ్బులు వస్తున్నాయి అది చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఎంతటి నీచానికి దిగజారారంటే.. వాడి పడేసిన పీపీఈ కిట్లు, గ్లౌజులను ఉతికి మళ్లీ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

దేశంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న వేళ ఓ వీడియో కలకలం రేపింది. వైద్య వ్యర్థాల నిర్వీర్యం చేసే ఓ సంస్థ ఉద్యోగులు పీపీఈ కిట్లను ఉతకడం వైరల్‌గా మారింది. వినియోగించిన పీపీఈ కిట్లు, గ్లౌజులను నిర్వీర్యం చేయాల్సింది పోయి.. వాటిని ఉతికి మళ్లీ అమ్ముతున్నారు. ఓ చోట భారీ సంఖ్యలో వాడిపడేసి ఉన్న పీపీఈ కిట్లు, గ్లౌజులను కొందరు నీటిలో ఉతుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శుభ్రం చేసి ఆరబెట్టి, మడతబెట్టిన కొన్ని పీపీఈ కిట్లు కూడా అక్కడున్నాయి. సాత్నా జిల్లాకు చెందిన ఓ సంస్థ ఈ రకంగా పీపీఈ కిట్లను వేడి నీటిలో శుభ్రం చేసి వాటిని విక్రయిస్తున్నట్లు తెలిసింది.

ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వారు అలర్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై సత్నా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాజేశ్‌ షాహి దర్యాప్తునకు ఆదేశించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బృందం సంబంధిత బయో వేస్ట్ ప్లాంట్‌కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. 2006 నుంచే సదరు సంస్థ వైద్య వ్యర్థాలను సేకరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సదరు ప్లాంట్‌ వైద్య వ్యర్థాలను నిర్వీర్యం చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

‘పీపీఈ కిట్లను నిర్వీర్యం చేయకుండా వాటిని శుభ్రం చేయాలని మా అధికారులు చెప్పారు. వేడి నీరు వైరస్‌ను చంపేస్తుందని తెలిపారు. నిర్వీర్యం చేసేందుకు మా సంస్థకు ప్రతి రోజు దాదాపు వెయ్యి పీపీఈ కిట్లు వస్తాయి’ అని ఆ సంస్థ ఉద్యోగి చెప్పడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఈ వ్యవహారం అందరిని షాక్ కి గురి చేసింది. సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మనుషులను ఏం చేసినా పాపం లేదంటున్నారు. వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎవరూ చేయకుండా ఉండేలా శిక్షలు విధించాలంటున్నారు.