HC Redefines Rape : అత్యాచారానికి కొత్త నిర్వచనం చెప్పిన కేరళ హైకోర్టు..

అత్యాచారానికి కేరళ హైకోర్టు కొత్త నిర్వచనం చెప్పింది. ‘అమ్మాయిని మగవాడు ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుంది అని స్పష్టం చేసింది. బాలికపై లైంగిక దాడికి యత్నించి నానా హింసలు పెట్టిన ఓ కామాంధుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

HC Redefines Rape : అత్యాచారానికి కొత్త నిర్వచనం చెప్పిన కేరళ హైకోర్టు..

Hc Redefines Rape

Using a woman’s body part to mimic sexual penetration is rape: ఆడపిల్లు అంటే అంగట్లో బొమ్మలనుకునే కొంతమంది కామాంధులు ఇష్టమొచ్చిన చోటల్లా ముట్టుకుని శునకానందం పొందుతారు. అటువంటి సమయంలో అమ్మాయిలుగానీ, చిన్నారులు గానీ పైకి చెప్పుకోలేక ఆ వికృతచేష్టలు భరించలేక ఎంతగా మానసిక వేదన చెందుతారో వాళ్లకు అక్కరలేదు. ఇటువంటి ఘటనలు ఎవరికైనా చెప్పుకోకుండా వారిలో వారే కృంగిపోతుంటారు. వారి బాధను ఎవ్వరికీ చెప్పుకోలేరు. వారి బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? కానీ..అటువంటి ఓ బాధితురాలి మానసిక వేదనను కేరళ హైకోర్టు అర్థం పెద్ద మనస్సుతో చేసుకుంది. వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే లైంగిక దాడే కాదు అంటూ కొత్త నిర్వచనం చెప్పింది.

‘‘అమ్మాయిని మగవాడు ఎక్కడ ముట్టుకున్నా..అది అత్యాచారం కిందికే వస్తుంది’’అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది కేరళ హైకోర్టు. ఆడపిల్లలను మగవాడు తన అవయవంతో ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుందని అని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగిక వేధింపుల కేసుపై గురువారం (ఆగస్టు 5,2021) కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోర్టులో నిందితుడు ‘‘నేను లైంగిక దాడికి పాల్పడలేదని.. కేవలం ఆ అమ్మాయిని నా జననాంగంతో టచ్‌ చేశానని.. అది లైంగిక దాడికి కింద ఎలా వస్తుంది? అంటూ కోర్టును ప్రశ్నించాడు. అతని వ్యాఖ్యలకు కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

జస్టిస్ కె వినోద్ చంద్రన్,జస్టిస్ జియాద్ రహమాన్ లతో కూడిన ధర్మాసనం అతడి వాదనను విన్న న్యాయస్థానం విచారణలో భాగంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. విచారణ అనంతరం అత్యాచారంపై ఓ వివరణ ఇచ్చింది ధర్మాసనం. ‘‘సెక‌్షన్‌ 375 ప్రకారం.. అమ్మాయి జననాంగాలతో పాటు ఆమె శరీరంపై పురుషుడి అవయవం ఎక్కడ తాకినా అది అత్యాచారం చేసినట్టేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. లైంగిక సంతృప్తి పొందటానికి అమ్మాయిలు ఆటబొమ్మలా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది.అనంతరం బాధితురాలి వయసును ఆమె తరఫు న్యాయవాది నిర్ధారించకపోవడంతో ఈ కేసును కొట్టివేసింది. నిందితుడికి మాత్రం జీవిత ఖైదు విధిస్తూ హైకోర్టు జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ జియాద్‌ రహ్మన్‌తో కూడిన బెంచ్‌ తీర్పునిచ్చింది.

కాగా ఈ కేసు 2015లో 11 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి ఎర్నాకుళం జిల్లాలోని తిరుమరదిలోని ప్రభుత్వ వైద్య శిబిరానికి వెళ్లింది. ఆ సమయంలో ఆ పాప కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లి వైద్య శిబిరానికి తీసుకెళ్లింది. ఆ చిన్నారిని వైద్య పరీక్షల్లో చిన్నారి జననాంగాలు రాపిడికి గురయ్యాయని దీంతో ఆ ప్రాంతంలో అత్యాచార యత్నం జరిగిందని తేలింది. ఈ విషయాన్ని ప్రశ్నించగా ఆ చిన్నారి తన పొగురు ఇంటిలోఉండే ఓ వ్యక్తి తనను ఏదో చేశాడని..కానీ నాకు నొప్పి అని ఏడ్చానని అప్పుడు అతని ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని బెదిరించి వదిలేశాడని (లైంగిక వేధింపులనీ..అత్యాచార యత్నం అనికూడా తెలియని అమాయకత్వంతో ఉన్న చిన్నారి) బాలిక డాక్టర్ కు తెలిపింది.

అదే విషయాన్ని ఆ డాక్టర్ ఆ చిన్నారి తల్లికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. కానీ సమాజానికి భయపడ్డ ఆ తల్లి దానిని వాయిదా వేసింది. అయితే, చైల్డ్‌లైన్ అధికారుల నుండి విచారణ ప్రారంభమైన తర్వాత..సదరు తల్లి ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన పొరుగువారిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిపై పోక్సో చట్టం (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం), లైంగిక వేధింపులు మరియు లైంగిక వేధింపులతో పాటు, అత్యాచారంతో సహా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.

ఈ కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలుచేసింది. కోర్టుకు అన్ని సాక్ష్యాలను పరిశీలించింది అనీ..”అనేక సందర్భాల్లో బాధిత బాలికపై వివిధ స్థాయిలలో లైంగిక వేధింపులు జరిగాయి” అని కోర్టు పేర్కొంది. కోర్టు అభిప్రాయం ప్రకారం..కేవలం స్త్రీ జననాంగంపై లైంగిక దాడి జరిగితేనే అది అత్యాచారం కిందకు రావటమే కాదు..స్త్రీ శరీరంలో మూత్రనాళం లేదా ఏ ఇతర భాగాన్ని తాకినా..వేధించినా అది అత్యాచారం కిందే లెక్క అని వ్యాఖ్యానించింది. అందుకే ‘‘నిందితుడిని నేరస్థుడిగా కోర్టు పరిగణిస్తోందని అతడికి ‘జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలు శిక్ష’ అని అని తీర్పునిచ్చింది.నిందితుడికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును యథాతథంగా అమలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఆడపిల్లలేదో పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్లుగా పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడుతుంటారు. లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. అటువంటివారికి ఎటువంటి శిక్ష వేసినా తక్కువేననిపిస్తుంది. కానీ నేను లైంగిక దాడిచేయలేదు. కేవలం నా జననాంగంతో ఆమెను టచ్ చేశాను..అంటూ దారుణంగా వ్యవహరించిందే కాకుండా తన పశుత్వాన్ని సమర్థించుకోవటానికి చూసిన సదరు నిందితుడికి హైకోర్టు జీవిత ఖైదు విధించటం లైంగిక వేధింపులకు పాల్పడేవారికి ఓ చెంప పెట్టు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.