పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు: అఖిలేష్ భార్యకు షాక్

  • Published By: chvmurthy ,Published On : April 29, 2019 / 09:39 AM IST
పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు: అఖిలేష్ భార్యకు షాక్

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ లో ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు. రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడి నుంచి సమాజ్వాది పార్టీ గెలుస్తున్నా…గడచిన 5 ఏళ్లలో నియోజక వర్గంలో ఏమి అభివృధ్ది జరగలేదనే ఆరోపణతో ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు.

మరోవైపు చివరి నిమిషంలో పోలింగ్ బూత్ 27,29 లను వేరే చోటకు మార్చటం కూడా ఓటర్ల ఆగ్రహానికి గురి కావల్సి వచ్చింది . 1999లో ఇక్కడ ములాయం సింగ్ గెలుపొందగా..2000,2004,2009 లో అఖిలేష్ గెలుపోందారు.2014 లో అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేసి  19 వేల మెజార్టీతో బీజేపీఅభ్యర్దిపై గెలుపొందారు.  ఇంతలా పట్టున్న నియోజక వర్గంలో పార్టీ పట్ల వ్యతిరేకత రావటం కాస్త ఆందోళన కలిగించే విషయమే.