ఐదేళ్ల మేనకోడలిని రేప్ చేసిన 16ఏళ్ల మేనమామ

ఐదేళ్ల మేనకోడలిని రేప్ చేసిన 16ఏళ్ల మేనమామ

బంధుత్వానికే అవమానం.. విలువలు కోల్పోతున్న వరుసలు.. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన మేనకోడలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ టీనేజర్. 16ఏళ్ల వయస్సున్న వ్యక్తి హమీర్‌‌పూర్ జిల్లాలోని కొట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

ఎస్పీ నరేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘శనివారం ఐదేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుంది. ఆమెకు బిస్కట్ ఎర చూపిన మేనమామ అతని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన తర్వాత బాలిక ఏడ్చుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి గోడు మొత్తాన్ని తల్లి ముందు వెల్లబోసుకుంది.

ఆ కుటుంబానికి చెందిన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేస్ రిజిష్టర్ చేసుకుని మైనర్ పై పలు సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేశారు. ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉండి బాలికను మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపించారు.